నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విజయవాడలోని తన రాజ్ భవన్ లో స్వాతంత్రదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ఎందరో ప్రమఖులు హాజరు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరైనా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో కనిపించక పోవడంతో చాలామంది ఆ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు ఆశ్చర్యపోయినట్లు టాక్. 

సాధారణంగా ఒక పార్టీ అధ్యక్షుడుగా కొనసాగే ప్రతి ప్రముఖ వ్యక్తికి ఇలాంటి కార్యక్రమానికి ఆహ్వానం అందుతూ ఉంటుంది. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజులలో హైదరాబాద్ రాజ్ భవన్ లో ఏ కార్యక్రమం జరిగినా పవన్ ఖచ్చితంగా హాజరు అయ్యేవాడు. అంతేకాదు ఆ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రులు కూడ పవన్ తో సన్నిహితంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

అయితే ఎన్నికల తరువాత మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకించి ఒక గవర్నర్ ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎట్ హోమ్ కార్యక్రమానికి పవన్ రాకపోవడం పై చాలమంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనితో పవన్ కు సరైన విధంగా ఆహ్వానం అందలేదా లేకుంటే ఆహ్వానం అందినా ఆ ఆహ్వానాన్ని పవన్ పట్టించుకోలేదా అంటూ అనేకమంది నిన్న జరిగిన కార్యక్రమంలో గుసగుసలు ఆడుకున్నట్లు టాక్. 

మరికొందరైతే ఓటమి పరాభవంతో పవన్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు అంటూ జోక్ చేసుకున్నట్లుగా కూడ తెలుస్తోంది. జాతీయ భావాలు ఎక్కువగా ఉండే పవన్ స్వాతంత్ర దినోత్సవంనాడు నిర్వహింపబడ్డ ముఖ్య కార్యక్రమానికి రాకపోవడం వెనుక ఎదో ఒక కారణం ఉండి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కమ్యూనిస్టు పార్టీల ఏపీ విభాగం నేతలు బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు విజయవాడకు చెందిన అనేకమంది పుర ప్రమఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పవన్ కనిపించక పోవడం పవన్ అభిమానులకు కూడ ఒక తీరని లోటుగా అనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: