ఒకరు ఒక సినిమాను తెలుగు తెరకు పరిచయం చేస్తే, ఆ సినిమా కనుక హిట్ అయితే అదే మార్గాన్ని అందరు ఎంచుకుంటారన్నది తెలుగు ఇండస్ట్రీకి ఆనవాయితీగా వస్తున్నా ఆచారం. గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఏరేంజులో కలెక్షన్లను రాబట్టిందో తెలిసిన విషయమే. ఇకపోతే, అందరు అలాంటి సినిమా చేయాలనీ అనుకుంటారు. ప్రస్తుతం అలాంటి భారీ బడ్జెట్ సినిమాలు అంటే ప్రభాస్ సాహో , చిరంజీవి సైరా.. ఈ రెండు సినిమాలు ఏ మాత్రం తీసిపోయేవి కావు.


సాహో సినిమా ఈ నెల 30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే ఒక నెల గ్యాప్ తో సైరా సినిమా విడుదలకాబోతుంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఇటు సినీ అభిమానుల్లోనూ, అటు సినీ ఇండస్ట్రీలోని ఆసక్తి నెలకొంది. సాహో సినిమా దాదాపుగా 550 కోట్లతో రూపొందించబడింది. ఈ సినిమా 650 కోట్ల రాబడుతుందని అంచనా.


సైరా సినిమా చరిత్రలో చెప్పుకోతగ్గ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా 250 కోట్ల వరకు రాబడుతుందని సినీ విశ్లేషకుల అంచనా. అంతకు మించిన కలెక్షన్లతో దూసుకుపోతుందని మెగా అభిమానులు అంటున్నారు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అంతే కాదు బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు ముందుకు వస్తున్నారు.


మరో విషయమేంటంటే.. సాహో సినిమాకు హిందీలో డబ్బింగ్ రైట్స్ కు 80 కోట్లు ఖర్చు కాగా, సైరా సినిమాకు 50 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రెండు సినిమాలలో బాలీవుడ్ టాప్ యాక్టర్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలుగా రూపొందుతున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: