కేరళకుట్టి నయనతార సినీ జీవితం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఈ సౌత్ లేడీ సూపర్ స్టార్ కు అర్జంట్ గా హిట్ కావాలి. దాంతో ఆమె నటించే మూడు సినిమాలపైనే బోలెడంత ఆశలు పెట్టుకుంది. ఆ ముగ్గురు స్టార్స్ పై భారం వేసి అంచనాల్లో మునిగితేలుతోంది.  

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా దూసుకు పోతున్న నయనతార జోరుకు స్పీడ్ బ్రేక్స్ పడ్డాయి. 2018లో వరుస హిట్లతో హవా చూపించిన ఈ లేడీ సూపర్ స్టార్ కు 2019లో మాత్రం వరుస షాక్ లు తగులుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఐదు నెలల్లో మూడు డిజాస్టర్లు నయనతార స్పీడ్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాయి. ఈ ఏడాది నయనతార నటించిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. నయన్ ప్రధాన పాత్రలో నటించిన ఐరా మార్చిలో విడుదల కాగా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక మేలో విడుదలైన మిస్టర్ లోకల్, రీసెంట్ గా రిలీజైన కొలైతియర్ కాలమ్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది. 

అజిత్ కు జోడీగా నటించిన విశ్వాసం సినిమా హిట్టే అయింది. కానీ సక్సెస్ క్రెడిట్ మొత్తం అజిత్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ మూడు ఫ్లాప్స్ తో తమిళంలో నయన్ హవా ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తున్న సైరాతో పాటు రజినీ కాంత్ దర్బార్, విజయ్ తో జోడీ కడుతున్న బిజిల్ సినిమాలపై ఆశలు పెట్టుకుంది. ఈ మూడు సినిమాలు హిట్ అయితే నయనతార ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. ఎందుకంటే ఆమె పెళ్లిపై రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మూవీస్ లో సక్సెస్ సాధించిందంటే ఇక పెళ్లి పీఠలు ఎక్కుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: