యువ దర్శకుడు హరీష్ శంకర్, 2006లో మాస్ మహారాజ రవితేజ, జ్యోతికల కలయికలో రూపొందించిన షాక్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా అప్పట్లో ఫ్లాప్ గా నిలిచి, దర్శకుడుగా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే ఆ తరువాత దాదాపుగా ఐదేళ్ల తరువాత అదే రవితేజ హీరోగా మిరపకాయ్ సినిమాను తెరకెక్కించిన హరీష్, ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఆ సినిమా విజయం తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణి ని దర్శకత్వం అవకాశం దక్కించుకున్న హరీష్ శంకర్, 

ఆయనతో కలిసి గబ్బర్ సింగ్ సినిమా తీశారు. అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద విజయాన్ని దక్కించుకోవడంతో, హరీష్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అదే ఊపులో ఆ వెంటనే ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్యా సినిమాను తీశారు హరీష్. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా, అప్పట్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి, హరీష్ కెరీర్ కు మరొక బ్రేక్ వేసింది. అనంతరం సాయి ధరమ్ తేజ్ తో తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సూపర్ హిట్ కొట్టగా, దాని తరువాత బన్నీతో తీసిన దువ్వాడ జగన్నాధం యావరేజ్ గా నిలిచింది. దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో వాల్మీకి అనే సినిమా తీస్తున్న హరీష్, ఎలాగైనా ఈ సినిమా తో సక్సెస్ అందుకుని, లైం లైట్ లోకి రావాలని చూస్తున్నారు. 

ఇటీవల తమిళ్ లో వచ్చిన జిగర్తాండ అనే సినిమాకు అధికారిక రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి వీక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. ఇక టీజర్ లో వరుణ్ స్టయిల్, మాస్ డైలాగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ తో హరీష్ మరొక గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ కొట్టే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు విశ్లేషకులు. అందులోనూ ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ సినిమాలు మాత్రమే చేసిన వరుణ్ కు ఈ సినిమా పక్కా మాస్ హీరోగా పేరును తెచ్చిపెట్టడం ఖాయం అని అంటోంది సినిమా యూనిట్. మరి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించిన వాల్మీకి, ఎంత మేర విజయాన్ని అందుకుని హరీష్ శంకర్ కు లైఫ్ ఇస్తుందో వేచి చూద్దాం....!! 



మరింత సమాచారం తెలుసుకోండి: