అందాల  ప్రగ్యా జైస్వాల్ కు లక్ చిక్కడంలేదు. అందుకోసం చాలానే ప్రయంతాలు చేస్తోంది. తన టాలెంట్ ని ఎంత ఉపయోగించినా కూడా ఆఫర్లు మాత్రం దరి చేరడంలేదు. దాంతో ఒకింత నిరాశలోనే ఈ ముద్దు గుమ్మ ఉంది. నాగ్ తో చేసిన నమో వెంకటేశాయా ఫ్లాప్ అయింది. ఆచారి అమెరికా యాత్ర అంటూ మంచు విష్ణుతో చేసిన కామెడీ మూవీ కూడా కాపాడలేకపోయింది. ఇక డైరెక్టర్ క్రిష్ణ వంశీ చేతిలో పడితే ఎవరికైనా రాత మారుతుందనుకుంటే నక్షత్రం  మువీ  కూడా సరిగా ఆడలేదు.


దాంతో ప్రగ్యా ఓ విధంగా అప్సెట్ అయింది. అయితే ఆమె ఇపుడు ఓ ప్రెస్టేజియస్ మూవీలో చేస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీలో ఆమె ఓ మంచి పాత్రలో కనిపించబోతోందిట. ఆ పాత్ర తనకు పేరు తెస్తుందని ప్రగ్యా కోటి ఆశలు పెట్టుకుంది. సైరా సూపర్ హిట్ అవడం ఖాయం కాబట్టి తనకు కూడా ఆఫర్లు వెల్లువెత్తుతాయని ప్రగ్యా లెక్కలేసుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ అమ్మడు తన అందాల ప్రదర్శనకు మాత్రం ఎక్కడా బ్రేకులు వేయడంలేదు. ఆమె వంపులు సొంపులతో రంపపు కోత కోస్తోంది.


ఎక్కడా అంటే ఇన్స్ట్రాగ్రాం ద్వారానట. అక్కడ ప్రగ్యా పెట్టే పిక్స్ కి నెటిజన్లు పులకరించిపోతున్నారుట. ప్రగ్యా ఇంత అందం ఉండి ఎందుకు మూవీస్ చేయడంలేదు అని నెటిజన్లు అడుగుతూంటే తనకేం తెలుసు అంటోంది. అందంతో మాత్రమే కాదు అభినయంతోనూ తాను నెగ్గుకువస్తానని గడుసుగా సమాధానం చెబుతోంది  మెగా కాంపౌండ్ లో ఎటూ అడుగుపెట్టింది కాబట్టి ఇక తిరుగులేదని కూడా అన్న వారూ ఉన్నారు. . తెలివైన ప్రగ్యాకు టాలీవుడ్ చాన్సులు ఇస్తుందా, సైరా తరువాత దశ తిరుగుతుందా అన్నది చూడాలి. మొత్తానికి కరువు తీరా హిట్ సైరాతో ప్రగ్యాకు దక్కాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: