మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో, అక్కినేని సమంత హీరోయిన్ గా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ రంగస్థలం.1980 కాలం నాటి పరిస్థితుల్లో రంగస్థలం అనే గ్రామంలో జరిగే కథగా రూపొందిన ఈ సినిమా, రిలీజ్ అయిన మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొతం చేసుకుని, సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో చెవిటివాడిగా చిట్టిబాబు అనే పాత్రలో నటించిన రామ్ చరణ్, నటించారు అని అనడం కంటే, జీవించారు అని చెప్పవచ్చు. 

ఇక ఆయనకు జోడిగా రామలక్ష్మి అనే పాత్రలో సమంత కూడా ఎంతో అద్భుతంగా నటించడం, అలానే సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర కూడా సహజత్వానికి దగ్గరగా ఉండడంతో పాటు, ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన రంగస్థలాన్ని అంతటి భారీ విజయం దిశగా నడిపించాయి. ఇక ఈ సినిమాకు అవార్డుల పంట కూడా బానే పండుతోంది. నిన్న కతర్ లోని దోహాలో ఎంతో వైభవోపేతంగా జరిగిన సైమా - 2019 అవార్డుల్లో రంగస్థలం ఏకంగా 9 క్యాటగిరిలో అవార్డులను సొంతం చేసుకుని ఒక అద్భుత రికార్డుని నెలకొల్పింది. ఉత్తమ నటుడుగా రామ్ చరణ్, ఉత్తమ దర్శకుడుగా సుకుమార్, ఉత్తమ నటిగా(క్రిటిక్స్) సమంత, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ సహనటిగా అనసూయ, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ (ఎంత సక్కగున్నావే సాంగ్), 

ఉత్తమ నేపధ్య గాయనిగా మానసి (రంగమ్మా మంగమ్మా సాంగ్), ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, అలానే ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా రామకృష్ణ ఈ సినిమా తరుపున అవార్డులను అందుకున్నారు. ఈ విధంగా ఏకంగా 9 విభాగాల్లో అవార్డులు దక్కించుకుని రఫ్ఫాడించిన రంగస్థలం మూవీ టీమ్ పై మెగాఫ్యాన్స్ అభినందనలు కురిపిస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తమ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. ఇక అవార్డు గ్రహీతలకు పలువురు సినిమా ప్రముఖులు కూడా అభినందనలు తెలియచేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: