ఎవరైనా బూతు సినిమాల్లో ఎందుకు నటిస్తారు.. బాగా డబ్బులు వస్తాయని.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని.. మరికొందరేమో డబ్బు కోసం కాకుండా.. పేరు కోసం కూడా కాస్త హాట్ హాట్ గా నటిస్తుంటారు. అడల్ట్ సినిమాల్లో, పోర్న్ సినిమాల్లో నటిస్తే చాలు చాలా డబ్బు వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఎంత డబ్బు ఇచ్చినా మరీ అలా ఎలా నటిస్తారో అంటూ మరికొందరు నోరు నొక్కుకుంటారు.


కానీ చేదు విషయం ఏమింటంటే.. అడల్ట్ సినిమాలు, బూతు సినిమాల్లో నటించినా అందరికీ కోట్లకు కోట్లు వచ్చేయవట. చాలా కొద్ది మంది మాత్రమే అలా కోట్లు సంపాదిస్తారట. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఓ పోర్న్ స్టార్ బయటపెట్టింది. ఒకప్పుడు అడల్ట్, బూతు సినిమాల ద్వారా సంచలనం సృష్టించిన మియా ఖలీఫా అనే అమ్మడు ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.


పోర్న్ చిత్రాల్లో నటించడం ద్వారా తానేమీ కోట్లు కూడాబెట్టుకోలేదని తెగ బాధపడుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన బాధ వెళ్లబోసుకుంది. అసలు బూతు చిత్రాలు నటించడం ద్వారా తాను కెరీర్ మొత్తంలో సంపాదించింది కేవలం 12వేల డాలర్లు మాత్రమేనట.అంతకు మించి ఒక్క డాలర్ కూడా సంపాదించలేదట.


సాధారణంగా పోర్న్ స్టార్లు కోట్లకు కోట్లు సంపాదించుకుంటారనే అపోహ ఉందని.. దాన్ని పోగొట్టడానికే ఇలా చెబుతున్నానని అంటోంది ఖలీఫా. అంతే కాదట.. పాపం ఈ అమ్మడు..పోర్న్ సినిమాల్లో నటించడం మానేశాక.. వేరే ఎక్కడైనా ఉద్యోగం చూసుకుందామనుకున్నా కుదరడం లేదట. ఎవరూ తనకు ఉద్యోగం కూడా ఇవ్వడం లేదట.


పోర్న్ సినిమాలు చేసుకునే అమ్మాయి హఠాత్తుగా అవెందుకు మానేసింది అనుకంటున్నారా.. ఆమె హిజాబ్‌ వేసుకుని ఓ అడల్ట్‌ చిత్రంలో నటించింది. దాంతో ఐసిస్‌ టెర్రరిస్టులు బెదిరించారు. టెర్రరిస్టులు బెదిరించారని కాకపోయినా.. ఆ తర్వాత ఆమె పోర్న్ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా నాలుగు రాళ్లు వెనకేసుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: