ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డులు వచ్చేశాయి.. ఖతార్‌లో అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకకు తెలుగు సినీరంగం నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, కీర్తి సురేశ్‌, రాధిక, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌, విజయ్‌ దేవరకొండ తదితరులు హాజరయ్యారు.


ఈ అవార్డుల్లో తెలుగు సినీరంగం నుంచి ఎక్కువగా రంగస్థలం, ఆర్ఎక్స్ 100 , మహానటి సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. మహా నటి సినిమా ఉత్తమ చిత్రంగా.. ఆ సినిమాలో నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా... రాజేంద్రప్రసాద్ ఉత్తమ సహాయనటుడుగానూ అవార్డులు దక్కించుకున్నారు. ఇక రంగ స్థలం సినిమాఅయితే.. అవార్డుల పంట పండించుకుంది. ఉత్తమ దర్శకుడుగా సుకుమార్‌, ఉత్తమ నటుడుగా రామ్‌చరణ్‌, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి గా సమంత, ఉత్తమ సహాయ నటిగా అనసూయ, ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవీ శ్రీ ప్రసాద్‌, ఉత్తమ గాయనిగా ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ ), ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు, ఉత్తమ కళా దర్శకుడుగా రామకృష్ణ, ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే ) అవార్డులు దక్కించుకున్నారు. ఈ సినిమాకు మొత్తం..9 అవార్డు దక్కడం విశేషం.


ఇక తెలుగులో సంచలన హిట్ గా నిలిచిన ఆర్ఎక్స్ 100 సినిమాకు కూడా అవార్డులు బాగానే వచ్చాయి. ఉత్తమ గాయకుడుగా పిల్లారా.. పాటకు అనురాగ్ కులకర్ణి, ఉత్తమ తొలిచిత్ర నటిగా పాయల్‌ రాజ్‌పుత్‌, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడుగా అజయ్‌ భూపతి అవార్డులు దక్కించుకున్నారు.


ఇక ఈ మూడు సినిమాలు కాకుండా... విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడుగా సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ స్టార్ గా.. విజయ్‌ దేవరకొండ రెండు అవార్డులు అందుకున్నాడు. ఉత్తమ హాస్య నటుడుగా సత్య (ఛలో), ఉత్తమ విలన్‌ గా శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా), ఉత్తమ తొలిచిత్ర నటుడుగా కల్యాణ్ దేవ్‌ (విజేత) అవార్డులు దక్కించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: