తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ ను బాహుబలి అమాంతం పెంచేసింది... అంతకుముందు 100 కోట్ల క్లబ్బులో ఓ తెలుగు సినిమా చేరడమే కష్టం అనుకునే రేంజ్ నుంచి ఏకంగా 1500 కోట్ల బిజినెస్ చేసి బాహుబలి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ ల రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ తన తర్వాతి సినిమాను కూడా భారీ స్థాయిలోనే తీసుకొస్తున్నాడు.


బాహుబలి రేంజ్ కాకపోయినా... ఆ స్థాయికి తగ్గొద్దు అన్నట్టుగా ప్రభాస్ తన తర్వాతి మూవీని ప్లాన్ చేసుకున్నాడు. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో సాహో కు ఓకే చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ కూడా దాదాపు 330 కోట్ల రూపాయలు చేసిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాకు ప్రభాస్ ఎంత పారితోషకం తీసుకున్నాడు..


ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. ఇదే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పిన సమాధానం ఆశ్చర్యపరచింది. డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీ ప్రమోషన్లలో భాగంగా ముంబై మిర్రర్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తాను రూ. 100 కోట్లు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చాడు.


ప్రభాస్ ఏమన్నాడంటే..

బాహుబలి చిత్రం నా రేంజ్ ని పెంచింది. అందుకే నా నెక్స్ట్ సినిమా 'సాహో'... రూ. 250 కోట్ల బడ్జెట్ తో వస్తోంది. నాచురల్ గా నా రెమ్యూనరేషన్ కూడా పెరగాలి.. కానీ నేను బాహుబలి కంటే ఈ సినిమాకు రెమ్యూనరేషన్ 20 శాతం తగ్గించుకున్నా.. వాస్తవానికి ఈ సినిమా నిర్మాతలు ఆ డబ్బు కూడా ఇస్తామన్నారు. కానీ వారు ఈ సినిమాను ఈ స్థాయిలో నిర్మించడమే నాకు ఓ బహుమానం.. అందుకే నేను డబ్బు విషయం పెద్దగా పట్టించుకోలేదు.. అని డార్లింగ్ ప్రభాస్ చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: