ఆగస్ట్ 9 వ తేదీన విడుదలైన మన్మథుడు2 సినిమాకు తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చింది. మన్మథుడు లాంటి హిట్ సినిమా పేరుతో రావటం, చి ల సౌ హిట్ తరువాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించటంతో మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయి. మన్మథుడు2 సినిమాకు పోటీగా విడుదలైన కథనం, ఆయోగ్య, కురుక్షేత్రం సినిమాలకు మంచి టాక్ రాకపోవటంతో మన్మథుడు2 సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేసారు. 
 
వీకెండ్ వరకు మన్మథుడు2 సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చినా సోమవారం నుండి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. సోమవారం తరువాత సినిమా ఏ మాత్రం పుంజుకోలేదు. నాగార్జున నటించిన మనం, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు 40, 50 కోట్ల రుపాయల షేర్ సాధిస్తే మన్మథుడు2 సినిమా కలెక్షన్లు మాత్రం 10 కోట్ల రుపాయల దగ్గరే ఆగిపోయేలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియాలో మాత్రమే 2కోట్ల రుపాయలకు పైగా మన్మథుడు2 షేర్ వసూలు చేసింది. 
 
మన్మథుడు2 షేర్ వసూళ్ళ విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమా 2కోట్ల 42 లక్షలు, సీడెడ్ ఏరియాలో 95 లక్షలు, నెల్లూర్ జిల్లాలో 31 లక్షలు, కృష్ణా జిల్లాలో 65 లక్షలు, గుంటూర్ జిల్లాలో 88 లక్షలు, వైజాగ్ ఏరియాలో 92 లక్షలు, గోదావరి జిల్లాల్లో 98 లక్షల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మన్మథుడు2 7 కోట్ల 11 లక్షల షేర్ వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 13 లక్షల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. 
 
నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత నాగార్జున బంగార్రాజు సినిమాలో నటించబోతున్నాడు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: