రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ తన అభిమానులు ఒకొక్కరు ఒక్క రూపాయి విరాళం ఇచ్చినా నిధుల సమస్య ఉండదని పిలుపు ఇచ్చాడు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ఉద్యమానికి నిధులు సమకూర్చడానికి చాలామంది ఒక పూట భోజనంమాని ఆ డబ్బును తెలంగాణ ఉద్యమానికి నిధులుగా ఇచ్చిన విషయం తనకు తెలుసు అంటూ తన అభిమానులకు స్పూర్తిని కలిగించడానికి ప్రయత్నించాడు.

నిధులు లేక ప్రతి ఊరులో ‘జనసేన’ ఆఫీసు పెట్టలేకపోతే టెంట్స్ వేసుకుని ‘జనసేన’ పార్టీని నడుపుదామని తనతో ఫోటోలు తీయించుకోవడానికి అభిమానులు పడే తపన పార్టీ పై ఉంటే వచ్చే ఎన్నికలలో అధికారం ఖాయం అంటూ అభిమానులను పవన్ చైతన్యపరిచాడు. ఇప్పుడు పవన్ మాటల ప్రభావం పవన్ అభిమానుల పై తీవ్రంగా పనిచేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

పవన్ వీరాభిమానులు అంతా ఒక లక్ష్యంగా పెట్టుకుని వచ్చేనెల సెప్టెంబర్ 2వ తారీఖున రాబోతున్న పవన్ పుట్టినరోజు సమయానికి 100 కోట్ల విరాళాలు సేకరించి ‘జనసేన’ నిమిత్తం పవన్ కు బహుమతిగా ఇవ్వాలని అప్పుడే కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికోసం సోష‌ల్ మీడియాలో ‘జ‌న‌సేన డొనేష‌న్స్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి విరాళాలు సేక‌రిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అభిమానుల నుండి కూడ స్పందన బాగా వస్తోందని సమాచారం.

అయితే ఈ విషయాలు అన్నీ పవన్ అనుమతితో జరిగాయా లేకుంటే అభిమానుల అత్యుత్సాహమా అన్న విషయమై క్లారిటీ లేదు. దీనితో ఇలాంటి ప్రయత్నాలు సరిగ్గా నిర్వహించకపోతే కొన్ని పొరపాట్లు కూడ జరిగే ఆస్కారం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలలోని యధార్ధత గురించి పవన్ దృష్టికి తీసుకు వెళ్ళడానికి కొందరు పవన్ సన్నిహితులు ప్రయత్నిస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: