తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం శుభపరిణామం. ఇప్పటి వరకూ హిందీ సినిమాలే భారతీయ సినిమాలన్న భావనను మన తెలుగు సినిమాలే డామినేట్ చేసి సత్తా చాటుతున్నాయి. ఇటివల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయి. మహానటిలో సాక్షాత్తూ ఆనాటి సావిత్రమ్మే వచ్చి నటించిందా అనే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కీర్తి సురేశ్ కు జాతీయ ఉత్తమ నటి అవార్డు రావడం ఇందుకు ఉదాహరణ. ఆమె కెరీర్ ఇదో కలికితురాయి.


 

ఇటివల ఖతార్ రాజధాని దోహాలో సైమా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో పలు భాషల సినీ రంగాలకు చెందినవారంతా హాజరయ్యారు. ఈ ఉత్సవానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి హైలైట్ గా నిలిచి నిండుదనం తెచ్చారు. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యింది. సైమా బెస్ట్ యాక్టరెస్ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఈ అవార్డు కంటే ముందు ఆమె మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. చిరంజీవి ఎంతో ఆప్యాయంగా ఆమెను పలకరించి తన ఆశీస్సులు అందించారు. చిరంజీవి ఆమెతో ముచ్చటిస్తున్న స్టిల్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మహానటి సావిత్రినే తలపించే విధంగా నిండైన చీరకట్టులో కీర్తి సురేశ్ మెరిసిపోయింది. సైమా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సంఘటన ఉత్సవానికే నిండుదనం తెచ్చిందనడంలో సందేహం లేదు.

 


మహానటి చిత్రంలో కీర్తి సురేశ్ నటనకు అందరూ ఆశ్చర్యపోయారు. అంతటి నటనకు జాతీయ అవార్డే వచ్చిందంటే మరెన్ని అవార్డులు ఆమె చెంతకు రానున్నాయో చూడాల్సిందే. చిరంజీవి ఈ ఉత్సవంలో రంగస్థలంలో రామ్ చరణ్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. చరణ్ తరపున మెగాస్టార్ ఈ అవార్డు అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: