రేపు జరగబోతున్న ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఈ మూవీని ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ వాడిన వింత పదం పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ ఈమధ్య ‘సాహో’ ప్రమోషన్ కోసం ముంబాయి వెళ్ళి ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ తో పాటు అనుపమ చోప్రా శ్రద్ధా కపూర్ లు కూడ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూను నిర్వహించిన ఫరిదూన్ షహర్యార్ ‘సాహో’ ‘బాహుబలి’ తో పోలుస్తూ అతడిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాడు. ‘సాహో’ ట్రైలర్ కు వచ్చిన స్పందన చూస్తూ ఉంటే ఆ మూవీ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు.

ఈ పొగడ్తలకు ప్రభాస్ ఏమాత్రం పొంగి పోకుండా "వావ్ సూపర్బ్..అయినా అది బా..హుబలి" అని నవ్వుతూ రికార్డులు బ్రేక్ చేయడం కష్టం అనే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూను హోస్ట్ చేస్తున్న షహర్యార్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ‘బాహుబలి’ కంటే ‘సాహో’ మొదటి రోజు రికార్డ్స్ తప్పకుండా బ్రేక్ అవుతాయి కదా అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. 

దీనితో ఆనందం పట్టలేక ప్రభాస్ అలా జరిగితే మంచిదే కదా అంటూ 'షికఫ్'.."  అంటూ అరబిక్ స్టైల్ లో ఒక కొత్త పదం వాడి వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. దీనితో ఈ ఇంటర్వ్యూను చూసిన చాలామంది ఈ పదం అర్ధం గురించి గూగుల్ లో ఎంత వెతికినా ఆ పదంకు అర్ధం దొరకలేదు. దీనితో బహుశ ప్రభాస్ 'బాహుబలి ఓ కొండ..పగలకొట్టడానికి వీలు లేని బండ' అనే అర్ధంతో ప్రభాస్ ఈపదం వాడి ఉంటాడు అని అనుకుంటున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు ‘ఫసక్’ అనే పదం వాడినప్పుడు కూడ ఇలాగే సంచలనమైంది. ఇప్పడు ప్రభాస్ ‘షికప్’ అతడి అభిమానుల మధ్య కొంతకాలం ఊత పదంలా మారే ఆస్కారం కనిపిస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: