సాహో భారీ బడ్జెట్ సినిమా. అందుకే రష్ కూడా భారీగానే వచ్చింది. ఇక ఎడిట్ వెర్షన్ లో కూడా 2 గంటల 52 నిమిషాల నిడివి వచ్చింది. నో స్మోకింగ్ యాడ్స్ కూడా కలుపుకుంటే నిడివి 3 గంటలు దాటిపోతుంది. ఇంత భారీ రన్ టైమ్ తో సినిమాను రిలీజ్ చేస్తే కష్టమని, రన్ టైమ్ కాస్త తగ్గించాలని యూనిట్ గత వారం రోజులుగా తర్జన భర్జన పడుతున్నారు. మొత్తానికి ఏలాగోలా కొన్ని షాట్స్ ని ట్రిమ్ చేశారు. అయినా కూడా రన్ టైమ్ ఇంకా ఎక్కువగానే ఉంది. అయితే సాహో సినిమాకు దాదాపు 6 నిమిషాల రన్ టైమ్ తగ్గించారు. అలా తగ్గించాక నిడివి 2 గంటల 46 నిమిషాలకు వచ్చిందట. ఇదే రన్ టైమ్ తో సినిమాను సెన్సార్ కు పంపించే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం.  

గతంలో రంగస్థలం, మహర్షి సినిమాలు దాదాపు ఇదే నిడివితో వచ్చాయి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే సాహో కంటే ఈ రెండు సినిమాల రన్ టైమ్ ఇంకా ఎక్కువేనని చెప్పాలి.
మహర్షి సినిమా 2 గంటల 48 నిమిషాల నిడివి ఉంటే, రంగస్థలం దాదాపు 3 గంటలుంది. అటు మహానటి కూడా 2 గంటల 56 నిమిషాలుంది. సో.. సాహో సినిమాకు 2 గంటల 46 నిమిషాల రన్ టైమ్ ను సరిగ్గా సరిపోతుందని  లాక్ చేసినట్టు తెలుస్తుంది. బాహుబలి-2 డ్యూరేషన్ కూడా కాస్త ఎక్కువే. కానీ అందులో ఎండ్ టైటిల్స్, క్రెడిట్ స్లైడ్స్ ఎక్కువ టైమ్ తినేశాయి. అలా చూసుకుంటే సినిమా నిడివి తక్కువే.

మరోవైపు మిగతా భాషలకు సంబంధించి ఇదే రన్ టైమ్ ఉంచాలా వద్దా అనే అంశంపై కూడా చర్చ సాగుతోందని లేటెస్ట్ న్యూస్. సాహో సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇతర భాషల్లో కాస్త తక్కువ నిడివితో రిలీజ్ చేయమని మేకర్స్ కు కొందరు సలహా ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే చివరి నిమిషంలో ఇలాంటి రిస్క్ ఎందుకని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: