‘సైరా’ మేకింగ్ వీడియో అనూహ్య స్పందనతో జోష్ లోకి వెళ్ళిపోయిన మెగా కాంపౌండ్ ‘సైరా’ ట్రైలర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీ మ్యానియా మరింత పెరిగేలా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించిన మార్కెటింగ్ విషయంలో చిరంజీవి చరణ్ కు ఇచ్చిన ఫ్రీ ఆలోచనలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సైరా’ మేకింగ్ కోసం చరణ్ కు 270 కోట్ల వరకు ఖర్చు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఖర్చుకు ఈ సినిమాకు సంబంధించి చిరంజీవికి ఇవ్వవలసిన 30 కోట్ల పారితోషికం కూడ లెక్కలోకి తీసుకుంటే ఈ మూవీ ప్రాజెక్ట్ ఖర్చు 300 కోట్లు దాటిపోయి ఈ మూవీని ఎంత భారీమొత్తాలకు అమ్మినా నాన్ ధియేటర్ హక్కుల ఆదాయాన్ని కలుపుకున్నా చరణ్ కు బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడ కష్టం అవుతోంది అన్నవార్తలు వస్తున్నాయి. 

దీనితో ఈ విషయాలను గ్రహించిన చిరంజీవి తన పారితోషికాన్ని ఈ మూవీ ప్రాజెక్ట్ ఖర్చుతో కలిపి టెన్షన్ పడవద్దని ముందు ఎటువంటి నష్టాలు లేకుండా ఈ మూవీ ప్రాజెక్ట్ మార్కెట్ పూర్తి చేయమని సలహాలు ఇచ్చినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు తన కెరియర్ లో ఒక అద్భుతమైన మూవీగా ‘సైరా’ మిగిలిపోవాలి కానీ తన పారితోషికం గురించి నటించిన మూవీ ‘సైరా’ కాదు అంటూ చిరంజీవి చరణ్ కు హితబోధ చేసినట్లు టాక్. 

దీనితో ‘సైరా’ మార్కెటింగ్ వ్యూహాలు మారాయి అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడ జరుగుతున్న నెగిటివ్ ప్రచారం మెగా కాంపౌండ్ ను కలవర పెడుతున్నట్లు సమాచారం. ‘సైరా’ మేకింగ్ వీడియోలో చిరంజీవి ఉగ్ర రూపానికి సంబంధించిన గెటప్ పై కొందరు యాంటీ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. బాలకృష్ణ ‘శాతకర్ణి’ లో గెటప్ లు ఇంకా రకరకాల పిక్స్ జాయింట్ చేసి మీమోలు తయారు చేసి సోషల్ మీడియాలో చేస్తున్న నెగిటివ్ ప్రచారం చూస్తుంటే ఈ మూవీని ఫెయిల్ చేయాలని అప్పుడే ప్రయత్నాలు కూడ మొదలు పెట్టేసారు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: