ఎఫ్ అండ్ ఆర్ సమర్పణ లో రాజా రెడ్డి మూవీ మేకర్స్ పతాకం పై రవి తేజ ( జూనియర్ ) , నిక్కీ శ్రావణి , శృతి శెట్టి హీరో హీరోయిన్స్ గా సురేష్ తిరుమూరు దర్శకత్వం లో రాజా రెడ్డి కందల నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ "లైఫ్ అనుభవించు రాజా ". ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఆకాష్ పూరి ఆవిష్కారించారు . ఈ కార్యక్రమం లో ఆర్టిస్ట్ షాని సాల్మన్ కెమరామెన్ రజిని దర్శకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు .
ఈ సందర్భం గ హీరోపూరి ఆకాష్ మాట్లాడుతూ... ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది . ఈ టీం కి నా విషెస్ తెలుపుతున్నాను అని అన్నారు.
చిత్ర దర్శకుడు సురేష్ తిరుమూరు మాట్లాడుతూ ...ఇదొక వెరైటీ చిత్రం . మా చిత్ర ఫస్ట్ లుక్ ని ఆకాష్ రిలీజ్ చెయ్యటం చాలా ఆనందం గా ఉంది . ఆకాష్ గారికి నా థాంక్స్ తెలుపుతున్నాను అన్నారు.
ఇదిలా ఉంటే ఇక పూరీ కొడుకు తో విడుదల చెయ్యడానికి కారణం ఏంటి అంటే పెద్ద డైరెక్టర్ కొడుకు కాబట్టి దాని వల్ల ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంటుందనా లేక ఆ హీరో హీరోయిన్లు కూడా చాలా చిన్న వాళ్ళని తనతో విడుదల చేయించారా అన్నది అర్ధం కావడంలేదు. ఇదిలా ఉంటే చిన్న వయసులోనే హీరోగా రెండు చిత్రాల్లో నటించిన పూరి ఆకాష్ మళ్ళీ ఆలాంటి ఎటెంపట్ ఏమీ చెయ్యడంలేదేమో. అందుకే బహుశా ఇలా గెస్ట్‌లా వచ్చి కొన్ని చిన్న సినిమాలకు ప్రోత్సాహాన్ని అందివ్వాలనుకుంటు న్నాడేమో అని కొందరు గుసగుసలాడుతున్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: రామ్ . సింగర్స్ : కార్తీక్ , శ్వేతా మోహన్ , హరి చరణ్ , బ్లాజే , ఎడిటర్ : సునీల్ మహా రానా, కెమెరా : రజని , కొరియోగ్రఫీ : యాని , పబ్లిసిటీ డిజైనర్ : శ్రీనాథ్ దాసరి , పిఆర్ ఓః బి . వీరబాబు , నిర్మాత : రాజా రెడ్డి కందల , కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : సురేష్ తిరుమూరు.