మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయోది సైరా. ఈ సినిమా చిరు సినీ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ లా వుండాలని చిరు తనయుడు, నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బడ్జెట్ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా భారీగా ఖర్చుచేసి ఈ సినిమాను నిర్మించారు. అందుకే ఈ సినిమాకు ఇప్పటికి అక్షరాలా 270 కోట్లు ఖర్చయిందని లేటెస్ట్ న్యూస్. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇంత భారీ సినిమాకి చిరంజీవి రెమ్యూనిరేషన్ తీసుకోకపోవడం. అయినా రికవరీ చూస్తుంటే అంత వస్తుందా? అని అనుమానం కలుగుతోందని ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటునట్టు తెలుస్తోంది. 

ఎంత మార్కెట్ చేసినా, నాన్ థియేటర్ హక్కుల ఆదాయం కలుపుకున్నా, జస్ట్ బ్రేక్ ఈవెన్ అవుతుందేమో అని లెక్కలు కడుతున్నారట విశ్లేషకులు. సరే అంత వరకు బాగానే ఉంది. మరి మెగాస్టార్ రెమ్యూనిరేషన్ సంగతేంటి? ఆయన రెమ్యునిరేషన్ ఎంత కాదన్నా కనీసం ముఫై కోట్లు యాడ్ చేయాలి. కానీ ఇప్పటి వరకు నాన్ థియేటర్ హక్కుల డీల్ సెటిల్ కాలేదని సమాచారం. అది ఫైనల్ అయితేనే అన్నీ కలిపి 270 కోట్లు రికవరీ వస్తుందో, రాదో తెలుస్తుంది. 270 వెనక్కు వచ్చేసినా, చిరు రెమ్యూనిరేషన్ వుండదు. అంటే చిరు తన కొడుకు కోసం సైరాలో ఫ్రీగా నటించినట్లేనని ఫిక్సవ్వాలి. 

అయితే సినిమా బడ్జెట్, మార్కెట్, ఎంత వస్తుంది? ఎంత లాస్? ఇవన్నీ తనకు అనవసరం. డాడీకి ఓ మాంచి సినిమా గిఫ్ట్ గా ఇవ్వడమే తనకు కావాలి అంటున్నాడట రామ్ చరణ్. అయినా చిరు, చరణ్, ఉపాసనల స్టామినాకు, బ్యాకప్ కు, ఈ యాభై, వంద కోట్లు అన్నది నథింగ్ అనుకోవచ్చునని మెగా ఫ్యాన్స్ చెప్పుకోవడమే కాదు అన్నయ్య సినిమాకు 700 కోట్ల వరకు వస్తాయని ధీమాగా ఉన్నారట


మరింత సమాచారం తెలుసుకోండి: