విజయ్ బిగిల్ ఇదేదో కొత్త పదం అనుకోకండి.. కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న చిత్రం  బిగిల్. బిగిల్ అంటే విజిల్ అని అర్థం. ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా ఉంటుందట. ఫిమేల్ పుడ్ బాల్ ప్లేయర్స్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు ఆ దర్శకనిర్మాతలు.


అటు తమిళ్ లో, ఇటు తెలుగులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్, మొదట్నుండి ఎంచుకున్న కథలన్నీ ప్రేక్షకులను ఆలోచింప చేస్తాయి. ఈ సినిమా కూడా అలానే ఉండొబోతుందని అందరు అనుకుంటున్నారు. బిగిల్ అనేది ఒక విజిల్ కొట్టు అని అర్థమోస్తుందట.


ఈ సినిమా ఆద్యాంతం విజిల్ మాటతో నడుస్తుంది. విజయ్ అన్నకు విజిల్ కొట్టు అని చిత్ర యూనిట్ అంటున్నారు. విజయ్ విజిల్ కొట్టే అంత పని ఏంచేశారు అనేది తెలియాలంటే సినిమాలోనే చూడాలి. విషయానికొస్తే.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తున్నా తరుణంలో హీరో విజయ్ అందరికి బహుమతులిచ్చారట. మామూలుగానే ఈయన ఏ సినిమా చేసిన కూడా ఆ చిత్ర బృందానికి బహుమతులివ్వడం అయన నైజం.


ఎవరైనా కలిసి పనిచేశాం అనే అభిమానంతో ఏ వాచో, ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తారు. కానీ, ఇక్కడ  ఆలోచనలకూ బిన్నంగా జరిగిందనే చెప్పాలి. అందరిని షాక్ కి గురిచేస్తూ..విజయ్  గోల్డ్ రింగ్ ఇచ్చారట.. ఆ రింగ్ పై బిగిల్ అని కూడా  రాసుందట. దీనిని కొందరు సినిమా ప్రొమోషన్ బాగానే చేస్తున్నారు అని కామెంట్లు చేయగా, మరికొందరేమో విజయ్ ఆలోచనలు ఎప్పుడు హైప్ అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: