‘రణరంగం’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినా ఆ విషయాలను లెక్క చేయకుండా ఈ మూవీ సక్సస్స్ అయింది అంటూ నిన్న నిర్వహించిన మీడియా మీట్ లో శర్వానంద్ చేసిన కామెంట్స్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిన్న జరిగిన సక్సస్స్ మీట్ లో శర్వానంద్ మాట్లాడుతూ సాధారణంగా తన సినిమాలకు ఏ క్లాసు సెంటర్స్ లో మంచి టాక్ వస్తుందని అయితే దీనికి భిన్నంగా ఏ క్లాసు సెంటర్స్ లో ఈ మూవీకి డివైడ్ టాక్  వచ్చినా ఈమూవీకి బిసి సెంటర్లలో హిట్ టాక్ వచ్చింది అని చెపుతూ తన మూవీ రివర్స్ టాక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఈ సినిమా మార్నింగ్ షోకి డివైడ్ టాక్ మ్యాట్నీకి పరవాలేదు ఫస్ట్ షోకి  యావరేజ్ సెకండ్ షోకి ఎబో యావరేజ్ టాక్ తో ముందుకు దూసుకు వెళుతున్న నేపధ్యంలో ఈ మూవీ బయ్యర్స్ సేఫ్ అంటూ కామెంట్స్ చేసాడు. ఈ మూవీ ఒక  స్టైలిష్ యాక్షన్ ఫిలింగా తయారుకాడంతో ఈ మూవీకి వచ్చిన మొదటిరోజు కలెక్షన్స్ తన కెరియర్ లో వచ్చిన భారీ రికార్డుగా మారింది అంటూ కామెంట్స్ చేసాడు. 

ఇదే సందర్భంలో ఈ మూవీలో నటిచిన కాజల్ గురించి మాట్లాడుతూ ఈ మూవీ నిడివి సమస్య రీత్యా కాజల్ పాత్రను కుదించిన విషయాన్ని వివరిస్తూ కాజల్ కు ఓపెన్ గా క్షమార్పణ చెప్పాడు. ఈ మూవీకి 16 కోట్ల‌వరకు బిజినెస్ అయిన పరిస్థితులలో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి 16 కోట్ల షేర్ కూడా పెద్ద టార్గెట్ లాగే క‌నిపిస్తోంది. 

తొలిరోజు వ‌సూళ్లు బాగున్న‌ప్ప‌టికీ నిన్నటి రెండోరోజు నుంచి ఈ మూవీ కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. పడిపడిలేచే మనసు తరువాత వచ్చిన రానా ‘రణరంగం’ కూడ కలెక్షన్స్ విషయంలో వెనుక పడిపోవడంతో శర్వా మార్కెట్ బాగా పడిపోయే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: