మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా 'సైరా' సినిమా. రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 270 కోట్ల తో తెరకెక్కిన ట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో తన తండ్రి చిరంజీవి కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోవాలని ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎక్కడా కూడా ఖర్చు గురించి వెనుకాడకుండా రాజీపడకుండా సినిమా నిర్మించడం జరిగింది. కాగా ఈ సినిమాకి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి ఏమీ తీసుకోలేదని ఇండస్ట్రీలో కొత్తగా వినబడుతున్న టాక్.


ఇక విషయంలోకి వెళితే సినిమా థియేటర్ హక్కులు అలాగే మిగతా సినిమాకి సంబంధించిన ట్రాన్సాక్షన్ లెక్కలు కలుపుకుని చాలావరకు ప్రస్తుతం రికవరీ సినిమా చేస్తుందో లేదో అన్న డైలమాలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి  నాన్ థియేటర్ హక్కుల డీల్ సెట్ కాలేదు. అది ఫైనల్ అయితేనే అన్నీ కలిపి రూ.270 కోట్లు రికవరీ వస్తుందో.. లేదో తెలుస్తుంది. అయినా కానీ ఈ సినిమా కోసం చిరంజీవి రెమ్యునరేషన్ మాత్రం తీసుకోవడానికి ఇష్టంగా లేనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా తన కొడుకు కోసం చిరంజీవి ఫ్రీగా నటించినట్లే అని చాలామంది అంటున్నారు.


అయితే మరోపక్క నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కి డబ్బులు వచ్చిన రాకపోయినా తన తండ్రికి ఈ సినిమా ద్వారా మంచి గిఫ్ట్ ఇవ్వడమే గొప్పదనం గా ఫీల్ అవుతున్నట్లు...డబ్బులు అనేది మేటర్ కానట్టు ఇటీవల చాలా సార్లు చెర్రీ చెప్పుకొచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ మరియు నయనతార...తమన్నా లాంటి పెద్ద పెద్ద నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల చేస్తున్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: