మెగాస్టార్ సైరా అక్టోబర్ 2న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వార్ సినిమాతో మెగాస్టార్ కి పోటీ గా రానున్నాడు. అయితే అది టాలీవుడ్ లో కాదు..కేవలం బాలీవుడ్ లో మాత్రమే. అందుకే ఈ దసరాకి ఒక్కసారిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల సందడి మొదలు కాబోతోంది. ఇక రీసెంట్‌గా ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టిన సైరా బృందం మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి సైరా మీద ఊహించని విధంగా అంచనాలు పెరిగిపోయాయి. దాంతో దసరా బరి నుంచి వెంకీ మామ తప్పుకుంటోందని తాజా సమాచారం. అక్కినేని నాగచైతన్య-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా సైరా లాంటి పెద్ద సినిమా వున్నా కూడా అక్టోబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, దసరా బరి నుంచి వెంకీ మామ వెనక్కు జరుగుతోందని. విక్టరీ వెంకటేష్ కాలు బెణకడమనేది ఇందుకు కారణంగా చెబుతున్నప్పటికి అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. పదిరోజుల క్రితం వెంకటేష్ కాలు బెణికి మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బందిపడ్డారట. ఇదే విషయాన్ని యూనిట్ చిన్న గాయమే షూటింగ్ కు వస్తున్నారు' అని కవర్ చేశారు. అయితే అదే యూనిట్ ఇప్పుడు ఇంకో మాట చెబుతోంది. వెంకటేష్ గారు ఇప్పట్లో షూటింగ్ కు హాజరయ్యే పరిస్థితిలో లేరని అందువల్ల వెంకీ మామ దసరాలకు విడుదల చేయడం కాని పని అని చెబుతున్నారు.

అయితే సైరా మేకింగ్ వీడియో చూసాకే ఆ సినిమా తో పోటీ ఎందుకు వెనక్కి వెళితేనే బెటరని చిత్ర బృందం డిసైడయ్యారని సమాచారం. అందుకే వెంకీకి గాయం అన్న పాయింట్ వాడుకుని, సినిమాను వెనక్కు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారని కూడా వినిపిస్తోంది. వెంకీ మామ సినిమాకు యాభై కోట్లకు పైగా బడ్జెట్ అయింది. అంత మొత్తం రికవరీ కావాలంటే డేట్ బాగుండాలి.   సురేష్ బాబు జాగ్రత్త ఓ బేబీ సినిమాకు చేసినట్టుగా ప్లాన్ వేసి, సోలో డేట్ తెచ్చుకుని వెంకీ మామ ని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. ఇందులో వాస్తవమెంతుందో తెలీదుగాని సైరాతో పోటీ వస్తే మాత్రం వెంకీ మామ హిట్ టాక్ తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టమని అర్థమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: