ప్రభాస్ చాలామంది టాప్ హీరోలులా సినిమా ఫంక్షన్స్ లో హడావిడి చేస్తూ కనిపించడు. అదేవిధంగా స్టార్ హీరోలతో కలిసి పార్టీలకు వెళ్ళడు. ఇలాంటి ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జూనియర్ బన్నీలతో ఉన్న సాన్నిహిత్యంతో పాటు రామ్ చరణ్ తో తనకు కొత్తగా ఏర్పడిన స్నేహాన్ని వివరించాడు.

గత కొద్ది సంవత్సరాలుగా తనకు జూనియర్ అల్లు అర్జున్ లతో చాలమంచి సాన్నిహిత్యం కొనసాగుతోందని అయితే తాము తరుచు కలవక పోయినా కలిసినప్పుడు మాత్రం చాల సన్నిహితంగా మాట్లాడుకుంటాము అన్న విషయాన్ని ప్రభాస్ వివరించాడు. తనకు మిగతా హీరోలతో ఉండే సాన్నిహిత్యం గురించి తరుచు చెప్పుకునే అలవాటు లేదు కాబట్టి ఈ విషయాలు చాలామందికి తెలియవు అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

ఇక ఇదే సందర్భంలో తనకు రామ్ చరణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడుతూ రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళిలో తనకు చరణ్ తో బాగా సాన్నిహిత్యం పెరిగిన విషయాలను వివరిస్తూ కార్తికేయ పెళ్ళిలో తాను చరణ్ తో సరదాగా గడిపిన రోజులు తనకు బాగా గుర్తు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు భవిష్యత్ లో తాను చరణ్ తో ఒక మల్టీ స్టారర్ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ చరణ్ ప్రభాస్ లతో ఒక మల్టీ స్టారర్ రాబోయే విషయం గురించి లీకులు ఇచ్చాడు. 

సాధారణంగా సినిమా రాజకీయాలకు టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ రేస్ కు చాల దూరంగా ఉండే ప్రభాస్ ఇలా ఒకేసారి చరణ్ జూనియర్ అల్లు అర్జున్ లతో తన స్నేహాన్ని వివరించడం వెనుక ‘సాహో’ కు ఈ టాప్ హీరోల అభిమానుల అవసరం కూడ ఉంది అన్న విషయాన్ని గ్రహించి ఇలా తమ మధ్య ఉన్న స్నేహాన్ని ప్రభాస్ బయటపెట్టాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఇంతమంది టాప్ హీరోల గురించి మాట్లాడిన ప్రభాస్ మహేష్ గురించి మాట్లాడక పోవడం అత్యంత ఆశ్చర్యకరం..   


మరింత సమాచారం తెలుసుకోండి: