డైరక్టర్ మిస్కిన్ దర్శకత్వం లో విశాల్  డిటెక్టివ్ పాత్రలో నటింఛిన చిత్రం"తుప్పరివాలన్". తెలుగులో ఈ చిత్రం డిటెక్టివ్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు భాషాల్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి సిక్వెల్ వస్తుందని దాన్ని కూడా మిస్కిన్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు.  
 డైరెక్టర్ మిస్కిన్ లండన్ లోని షెర్లాక్ హోమ్స్ మ్యూజియం సందర్శించారు.  బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోలే రాసిన కల్పిత షెర్లాక్ హోమ్స్ . ఈ పాత్ర ఆధారంగా రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన చిత్రం "షెర్లాక్ హోమ్స్" పెద్ద విజయం సాధించింది. చాలా మంది  రచయితలకి ఈ పాత్ర ప్రేరణ. ప్రపంచంలో ఒక కల్పిత పాత్రకు సంబంధించి ఒక మ్యూజియం ఉండటం ఇదే ప్రథమం. ఈ పాత్ర ఎంత పాపులర్ అంటే షెర్లాక్ హోమ్స్-ఫాన్స్.కామ్ అనే వెబ్ సేట్ కూడా ఉంది.
డిటెక్టివ్ చిత్రంలో విశాల్ పోలిసులకు సాల్వ్ కానీ కేసు లను సాల్వ్ చేస్తాడు. అననుకోకుండా విశాల్ టేకాప్ చేస్తున్న కేసు లోకి ఒక కంట్రాకట్ట్ కిల్లర్ గ్యాంగ్ రావడంతో కథ మలుపు తిరుగుతుంది. తరువాత వాళ్ళను ఎలా చంపాడు అన్నది సినిమా కథ.ఈ సినిమా లోని క్యారెక్టర్ కూడా షెర్లాక్ హోమ్స్ లానే బిహేవ్ చేస్తుంది. డిటెక్టివ్- 2 పాత్రను మరింత అథెంటిక్ డిజెన్ చేస్తున్నారు. ఆ ప్రేరణ కోసం షెర్లాక్ హోమ్స్ సందర్శించారు కావచ్చు.
మిస్కిన్ దర్శకత్వపు శైలి చాలా వినూత్నంగా వుంటుంది.మిస్కిన్ దర్శకత్వం వహించిన "పిశాచి" తెలుగు లో విడుదల అయింది.ఈ చిత్రన్ని విశాల్ తన సోంత బ్యానర్ అయిన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ప్రస్తుతం విశాల్ దర్శకుడు సి సుందర్ దర్శకత్వం వహిస్తున్న"యాక్షన్"అనే చిత్రం లో నటిస్తున్నాడు. చిత్రం టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వస్తుంది .తమన్నా విశాల్ కు జోడి గా నటింస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: