సిని పరిశ్రమలో నెగ్గుకు రావాలంటే టాలెంట్ కంపల్సరీ.. బ్యాక్ గ్రౌండ్ ఉంటే అవకాశాలు వస్తాయేమో కాని వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకోవాల్సింది మాత్రం వారి టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అసలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్ తోనే గుర్తింపు తెచ్చుకుంటున్న వారు ఈమధ్య సిని పరిశ్రమలో కనిపిస్తున్నారు.   


వారిలో సినిమా సినిమాకు తన టాలెంట్ చూపిస్తూ సత్తా చాటుతున్న యువ హీరో అడివి శేష్ కూడా వస్తాడు. అడివి శేష్ చూసి క్షణం, గూఢచారి సినిమాలు హిట్ అందుకుని ఎవరు సూపర్ హిట్ కొట్టాడని అనుకుంటాం కాని అతను 2002లో శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన సొంతం సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేశాడు.


సినిమా మీద ప్యాషన్ ఉండబట్టే తనకు ఎలాంటి పాత్రలు వచ్చినా సరే నో చెప్పకుండా చేశాడు. ఫైనల్ గా హీరోగా తన కథలకు తానే చేసుకుంటూ హిట్లు కొడుతున్నాడు. ఎవరు సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ టాలెంట్ ఉంటే బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఏం కాదు. అడివి శేష్ చూసి వారు ప్రేరణ పొందాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. 


తెలుగు పరిశ్రమలో బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు టాలెంట్ ఉన్న వారికి తెలుగు పరిశ్రమలో తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పడం. ఔత్సాహికులకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అయ్యింది. అడివి శేష్ కూడా అలా టాలెంట్ ను నమ్ముకుని హీరోగా ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం ఎవరు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్ త్వరలో మేజర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో పాటుగా గూఢచారి 2 కూడా లైన్ లో ఉంది. గూఢచారి సినిమా కన్నా సీక్వల్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: