టాలీవుడ్లో వరుసగా విజయాలు సాధిస్తూ సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్లలో సమంత ఒకరు. సాధారణంగా ఏ హీరోయిన్ కైనా పెళ్ళైతే సినిమా అవకాశాలు తగ్గుతాయి. కానీ సమంతకు మాత్రం పెళ్ళైన తరువాత సినిమా అవకాశాలు పెరుగుతున్నాయి. పెళ్ళైన తరువాత సమంత నటించిన సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. పెళ్ళైన తరువాత సమంత నటించిన రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. 
 
రంగస్థలం తరువాత సమంత నటించిన మహానటి సినిమా కూడా మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. తమిళంలో సమంత నటించిన సూపర్ డీలక్స్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టైంది. సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలైన యూ టర్న్, ఓ బేబీ సినిమాలు కూడా హిట్టయ్యాయి. తన భర్తతో కలిసి సమంత నటించిన మజిలీ సినిమా నాగచైతన్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించింది. 
 
సమంత ఇలా వరుస హిట్స్ ఇవ్వటంతో దర్శకులు, నిర్మాతలు సమంతను తమ సినిమాల్లోకి తీసుకోవాలని సంప్రదిస్తున్నారట. కానీ ఓ బేబీ సినిమా తరువాత సమంత మరే కొత్త సినిమాకు కమిట్ కావటం లేదు. ఓ బేబీ సినిమాకు ముందే ఒప్పుకున్న 96 రీమేక్లో మాత్రమే సమంత నటిస్తోంది. ప్రస్తుతం సమంత కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ బ్రేక్ లో సమంత వెబ్ సిరీస్లో నటిస్తోందని సమాచారం. 
 
సాధారణంగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరోయిన్లెవరూ ఇలాంటి సాహసం చేయరు. కానీ సమంత మాత్రం వెబ్ సిరీస్ లో నటించబోతుంది. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నట్లు సమాచారం. కానీ సమంత అభిమానులు మాత్రం సమంత ఇప్పుడే వెబ్ సీరీస్ వైపు ఎందుకు చూస్తుందని కామెంట్లు చేస్తున్నారు. సమంత నటించిన వెబ్ సిరీస్ హిట్టైతే మాత్రం మిగతా హీరోయిన్లు కూడా ఇదే బాట పడతారనటంలో సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: