అర్జున్ రెడ్డి సినిమా తో వోవర్ నైట్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడి విజయ్ దేవరకొండ. ఇక గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మాతగా పరశురాం తెరకెక్కించిన గీత గోవిందం అయితే 100 కోట్ల క్లబ్ లో చేరి తన సినీ కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయో సినిమాగా మిగిలింది. దాంతో యూత్ లో విజయ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇక 'డియర్‌ కామ్రేడ్‌' విడుదలకి ముందు రౌడీ ఆటిట్యూడ్‌ మెయిన్టైన్‌ చేసి, దానినే ప్రమోట్‌ చేసుకున్న విజయ్‌ దేవరకొండ ఆ సినిమా డిజాస్టర్ తర్వాత చాలా మారిపోయాడు. డిఫ్రెంట్‌గా, డీసెంట్‌గా కనిపిస్తున్నాడు. పబ్లిక్‌తో ఇంటరాక్ట్‌ అయ్యేప్పుడు ఒక సిగ్నేచర్‌ స్టయిల్‌ మెయిన్టైన్‌ చేసే విజయ్‌ 'సైమా' ఈవెంట్‌లో మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు.

మైక్‌ పట్టుకోవడం దగ్గర్నుంచి, మాట్లాడే విధానం వరకు అతనిలో డిఫ్రెన్స్ క్లియర్‌గా కనిపించింది. తను చూపిస్తోన్న ఆటిట్యూడ్‌ మీడియాలో నెగిటివ్ గా ప్రొజెక్ట్‌ అవుతుందనో, లేక తనకి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కువైందన్న విమర్శలని రాకుండా చేయడానికో విజయ్‌ సడన్‌గా తన బాడీ లాంగ్వేజ్‌ మార్చుకున్నాడు. ఇలా మారడంతో చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు ఎవరికైనా ఒక ఫ్లాప్ పడితేగాని యాటిట్యూడ్ లో ఛేంజ్ రాదు..అన్న కామెంట్స్ ఈ సందర్భంగా పడుతున్నాయి.

యూత్‌కి నచ్చే రౌడీ ఇమేజ్‌ని కొనసాగించాలని చూసిన వాడే సడన్‌గా మాస్‌ సినిమా చేస్తానంటూ పూరి జగన్నాథ్‌తో ప్రాజెక్ట్‌ కూడా ఓకే చేసేసుకున్నాడు. యూత్ ని ఆకట్టుకునే తన యాటిట్యూడ్ మార్చుకోవడంతో విజయ్‌ మిగతా వాళ్ళకి దగ్గర కాగలడా లేక తన స్టయిల్‌ నచ్చే కుర్రాళ్లని కూడా దూరం చేసుకుంటాడా? అనేది ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయింది. ఏదేమైనా డియర్‌ కామ్రేడ్‌ ఫలితం అయితే విజయ్‌ని బాగానే ప్రభావితం చేసింది. మళ్ళి మాంచి మాస్ హిట్ పడితేగాని విజయ్ కోలుకోలేడు.



మరింత సమాచారం తెలుసుకోండి: