టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం ఆయన కెరీర్ 151వ సినిమా గా తెరకెక్కుతున్న సైరా నరససంహా రెడ్డి ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకుని డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తదితర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇకపోతే ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మేకింగ్ వీడియో అద్భుతమైన వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార జతకడుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవికిషన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తన్నారు. ఇకపోతే ఈనెల 20వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తామని మేకింగ్ వీడియోలో సైరా యూనిట్ ప్రకటించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించనున్న ఈ టీజర్ రిలీజ్ తరువాత ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు బాగా పెరుగుతాయని అంటోంది సినిమా యూనిట్. ఇకపోతే 22వ తేదీన మెగాస్టార్ బర్త్ డే ఉండడంతో ఆరోజున కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మెగాస్టార్ 152వ మూవీ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది టాలీవుడ్ వర్గాల సమాచారం. 

అంటే ఈ సమాచారాన్ని బట్టి, రెండు రోజుల వ్యవధిలో మెగా ఫ్యాన్స్ కు రెండు పండుగలు అన్నమాట. అయితే కొరటాల మూవీ ముహూర్తానికి ఎప్పుడో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, కానీ ఆ న్యూస్ బయటకు లీక్ కాకుండా యూనిట్ జాగ్రత్త పడ్డారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లు 20వ తేదీన సైరా టీజర్, తరువాత 22వ తేదీన మెగాస్టార్ న్యూ మూవీ లాంచింగా జరుగనున్న మాట నిజమే అయితే మాత్రం, మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: