ఒకప్పుడు బాక్సాఫీస్‌వద్ద కలెక్షన్స్ సృష్టించడంలో బాలీవుడ్ హీరోల సినిమాలు ముందుండేవి కాని గతకొంతకాలంగా టాలీవుడ్ సినిమాలు కూడా కలెక్షన్ల సునామిని సృష్టిస్తూ బాలివుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నాయ.అంతేకాకుండా గత కొన్నేళ్లుగా దేశంలోనే అన్ని చిత్ర పరిశ్రమలకు సవాలు విసురుతున్నారు.భారీ చిత్రాల నిర్మాణంతో పాటు, వినూత్నమైన చిత్రాలు నిర్మిస్తూ మిగతా పరిశ్రమలకు బెంచ్ మార్క్ సెట్ చేసే స్థితికి చేరింది టాలీవుడ్ పరిశ్రమ..ఇది శుభపరిణామమని చెప్పవచ్చు ..




ఇకపోతే గతకాలంలో సౌత్ నుండి ఒక్క తమిళ చిత్రాలకు మినహా మిగతా పరిశ్రమల చిత్రాలకు బాలీవుడ్ లో అంతగా ఆదరణ ఉండేదికాదు.కాని నేడు పరిస్థితులు మారాయి,దేశంలోని అన్ని పరిశ్రములు తెలుగు సినిమా వైపు చూస్తున్నాయి.వాటిలో త్వరలో విడుదలకు సిద్దమైన రెండు  భారీ టాలీవుడ్ చిత్రాలున్నాయి..అందులో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న  ప్రభాస్ మూవీ సాహో కాగా,మరొకటి చిరంజీవి నటిస్తున్న సైరా.ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషలలో విడుదల కానున్నాయి...




సాహో మూవీని 300కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో దర్శకుడు సుజీత్ తెరకెక్కించగా,రాయలసీమ మొదటితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా కూడా 200కోట్లకు పైగా బడ్జెట్ తో సురేంధర్ రెడ్డి తెరకెక్కించారు.ఈ రెండు చిత్రాలు కనుక బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే బాలీవుడ్ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని సినిపండితులు చెబుతున్నారు...




ఎందుకంటే ఈ మధ్య బాలీవుడ్ లో బడా చిత్రాలనిర్మాణం అంతగా జరగడం లేదు.అమీర్,అమితాబ్ కాంబినేషన్ లో వచ్చిన హై బడ్జెట్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారీ పరాజయం చవిచూసింది.కరణ్ జోహార్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర పేరుతో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.బాహుబలితో బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన టాలీవుడ్ ,ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే
ఆ ప్రభంజనం కొనసాగించినట్లవుతుంది.అందుకే బాలీవుడ్ అగ్ర హీరోలు,దర్శకనిర్మాతలు ఈ చిత్ర ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం...

మరింత సమాచారం తెలుసుకోండి: