టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పిక్ చూస్తే ఎవరైనా నోరు తెరవడం ఖాయం.. అలా ఉంది మరి ఆ చిత్రం.. ఓ పేరుమోసిన జిమ్నాస్టిక్ లా రకుల్ ప్రీత్ సింగ్ వేసిన ఈ యోగా భంగిమ అందర్నీ ఆశ్చర్యంలో ముంచుతోంది. బట్టలతో వేసిన తాళ్ల సాయంతో తలకిందులుగా వేలాడిన రకుల్ ప్రీత్ సింగ్ పిక్చర్ చూస్తే వారెవా అనాల్సిందే..


అందుకే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టగానే... ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. రకుల్‌ ఈ ఫొటో షేర్‌ చేసిన గంటలోనే 1.50 లక్షల మందికిపైగా లైక్‌ కొట్టేశారు. రకుల్ నువ్వు సూపర్ అంటూ మెచ్చుకున్నారు. తన సిన్సియారిటీనీ, హెల్త్ కాన్సెన్స్ ను తెగ మెచ్చుకున్నారు.


తాళ్లతో అలా శరీరాన్ని తలకిందులుగా ఉంచి.. కాళ్లతో నమస్కారం చేస్తున్న ఫొటోతో పాటు.. రకుల్... ఓ అందమైన క్యాప్షన్ కూడా పెట్టింది. అదేమిటంటే.. ఈ ప్రపంచానికి ఓ తిరకాసు నమస్కారం.. అన్షుక మీరు నా లైఫ్ చేంజర్.. ఇంతకీ ఈ అన్షుక ఎవరంటారా.. అన్షుక రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కోచ్.. రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ కు ఆమె వెంటనే రిప్లయ్ ఇచ్చింది. ఈ అభిమానానికి కృతజ్ఞురాల్ని అంటూ అన్షుక స్పందించింది.


రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు టాలీవుడ్ కు ఉన్న హీరోయిన్లందిరిలోనూ ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపించే హీరోయిన్.. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి ఈ విషయం బాగా తెలుసు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ తరచూ తన జిమ్ ఫోటోలు ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తుంటారు. కానీ ఈ రేంజ్‌ లో భంగిమ ఫోటో పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి: