ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంటే ఏమవుతుంది. ఈ సినిమా కమిటై అనవసరంగా తప్పుచేశామా అన్న ఫీలింగ్ ఆ హీరోకి కలగక మానదు. ప్రస్తుతం కాస్త అటు ఇటుగా యువ హీరో శర్వానంద్ అలానే ఫీల్ అవుతున్నట్టు ఉన్నాడు. తన ప్రతి సినిమాలో కథ విషయంలో జాగ్రత్త వహించే శర్వానంద్ రణరంగంలో రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  


ఇక చెప్పేదేముంది అలాంటి కథతో వస్తే ఆడియెన్స్ కూడా ఊహించిన ఫలితాన్నే అందించారు. సుధీర్ వర్మ డైరక్షన్ లో ఓ స్టైలిష్ మూవీని ఆడియెన్స్ కు అందిద్దామని అనుకున్నామని.. కాని సినిమా ప్రేక్షకులను నిరాశపరచిందని నిజాన్ని ఒప్పుకున్నాడు శర్వానంద్. అంతేకాదు సినిమా రివ్యూస్ చూసి బాధపడ్డ విషయాన్ని చెప్పుకొచ్చారు.


అయితే సినిమాలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయని.. సురేఖా ఆంటీ (చిరంజీవి సతీమణి) తనకు కాల్ చేసి సినిమాలో చాలా అందంగా ఉన్నావని అన్నారని చెప్పారు శర్వానంద్. అసలు రణరంగం సినిమా శర్వానంద్ చేయాల్సింది కాదట. మాస్ మహరాజ్ రవితేజ కోసం సుధీర్ వర్మ తయారు చేసిన కథట. రవితేజ ఈ సినిమాను చేయనని చెప్పడంతో శర్వానంద్ చేశాడు.


రవితేజ చేస్తే ఎలా ఉండేదో కాని శర్వానంద్ కు కచ్చితంగా ఇది కొత్త కథే.. కాని ఆడియెన్స్ ఇలాంటి సినిమా కథలు చాలా చూసి ఉన్నారు కాబట్టే రణరంగం మీద అంత ఆసక్తి చూపించడం లేదు. రణరంగంతో పాటుగా రిలీజైన అడివి శేష్ ఎవరు మాత్రం సూపర్ హిట్ టాక్.. సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం శర్వానంద్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ కూడా చేస్తున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: