బిగ్ బాస్ లో శనివారం  చాలా సరదాగా గడిచిపోయింది. నాగార్జున తనదైన శైలిలో కంటెస్టెంట్స్ తప్పులని ఎత్తి చూపుతూ ఎక్కడా ఓవర్ రియాక్ట్ అవకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే రాహుల్ కి మాత్రం చుక్కల్య్ చూపించాడనే చెప్పాలి. కంటెస్టెంట్స్ అందరూ ముసుగులు వేసుకుని గేమ్ ఆడుతున్నారని,ఆ ముసుగులు తీసేయాలని ఒక్కో కంటెస్టెంట్ కి అవార్డ్ ఇచ్చాడు. అలా రాహుల్ కి "మౌత్" అవార్డు వచ్చింది.


అంటే అతను ఎక్కువగా మాట్లాడతాడని, అనవసరంగా నోరు పారేసుకుంటాడని దాని అర్థం. రాహుల్ చేసిన తప్పుని ఎత్తి చూపుతూ ఒక వీడియో బైట్ కూడా వేయడం గమనర్హం. ఆ వీడియోలో రాహుల్ శ్రీముఖి గురించి మాట్లాడతాడు. శ్రీముఖి కి సారీ చెప్పిన తర్వాత ఆ టాపిక్ ని వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేయడమే నాగార్జున గారి కోపానికి కారణం. ఎవరైనా సారీ చెప్పినపుడు సరే నిన్ను క్షమించాను అంటారు. అంతకు మించి అనడానికి ఏముంటుంది. నువ్వు వేరే వాళ్ళతో ఈ టాపిక్ డిస్కస్ చేసావంటే నువ్వు మనస్ఫూర్తిగా సారీ చెప్పలేదన్నమాట అన్నాడు.


దాంతో రాహుల్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాటలతో దేన్నైనా మానిప్యులేట్  చేయగలవు అని అనడంతో రాహుల్ కొంత నొచ్చుకున్నాడు.  నిజానికి రాహుల్ ది ఎంత లూజ్ టంగో అందరికీ తెలుసు. టాస్క్ లలో ఆయన నుండి వచ్చే మాటలు కంటేస్టెంట్స్ ని ఇబ్బంది పెడతాయి. మరి నాగార్జున గారు చెప్పిన తర్వాతైనా రాహుల్ తన పద్దతిని మార్చుకుంటాడా అనేది తెలియాలి. పోయిన వారం కూడా తన లూజ్ టంగ్ ద్వారానే చీవాట్లు తిన్న రాహుల్ ఈ వారం కూడా అదే రిపీట్ కావడంతో అతనిలో ఏ మార్పు రాలేదని అర్థం చేసుకోవచ్చు. మరి ముందు ముందు ఎపిసోడ్ లలొ అతనిలో ఎటువంటి మార్పు వస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: