టాలీవుడ్ లో నేరురల్ స్టార్ నాని రూటే సపరేటు.  ఎంత సహజ సిద్దంగా నటిస్తాడో..అదే స్థాయిలో తన సినిమా కథలు కూడా ఎంచుకుంటారు.  భలే భలే మగాడివోయ్ లాంటి ప్రయోగాత్మక మూవీలో నటించిన తర్వాత నానికి బాగా కలిసి వస్తుంది. వరుస విజయాలతో సంవత్సరానికి రెండు మూడు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యక స్థానం సంపాదించాడు.  ఆ మద్య వచ్చిన కృష్ణార్జున యుద్దం, దేవదాసు లాంటి సినిమాలు కాస్త నిరాశ పరిచినా తర్వాత వచ్చిన ‘జర్సీ’ మనోడికి మంచి బూస్టింగ్ ఇచ్చింది.  ఈ మూవీ హిట్ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ లాంటి మరో ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారు. 

ఈ మూవీలో ఐదురుగురు ఆడవాళ్లు..ఐదు రకాల వయసు గల వాళ్ల కోసం ఎలా పోరాడుతాడు అన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతుందట.  కామెడీ, సస్పెన్స్ తో ఈ మూవీ బాగా అలరిస్తుందని నాని గట్టి నమ్మకంపైనే ఉన్నారు.  ఈ మద్య రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా నాని ఓ బాలీవుడ్ మూవీ రిమేక్ లో నటించబోతున్నారని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.  శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ   `అంధాధున్`.  ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

ఈ మూవీలో  ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ  తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు వర్షన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్ లీడర్ లైన్లో ఉండగానే ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నాడు.  ఈ సినిమా తరువాత అంధాదున్‌ రీమేక్‌ను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: