బాలీవుడ్ తో సహా ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అత్యంత క్రేజీ భారీ ప్రాజెక్ట్ సాహో. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ కి ధీటుగా భారీగా ఫంక్షన్ ని నిర్వహించనున్నారు సాహో చిత్ర బృందం. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన సాహో విడుదల దగ్గరకు వస్తున్న సందర్భంగా భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఆదివారం నిర్వహిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఇందుకోసం భారీ ఏర్పాట్లుచేస్తున్నారు. సాహో కోసం తయారుచేసిన వాహనాలు, ఇతర సామగ్రి అంతా ఇక్కడ ప్రదర్శనగా వుంచుతున్నారని లేటెస్ట్ న్యూస్. భారీ స్టేజ్ తో పాటు, అభిమానుల మధ్య మరో స్టేజ్ కడుతున్నారని సమాచారం. 

ఈ స్టేజ్ మీదకు ప్రభాస్ ప్రత్యేకంగా వచ్చి, అభిమానులకు అభివాదం చేసి ఆ తరువాత ప్రధాన వేదిక మీదకు వెళ్తారట. కేవలం ప్రేక్షకుల కోసమే రామోజీ ఫిలిం సిటీని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంచుకున్నారని తెలుస్తోంది. అత్యంత భారీ సినిమా కావడంతో ఈ ఈవెంట్ కు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరు అవుతారు కాబట్టి అందరిని కంట్రోల్ చేయడం కష్టం. అంతేకాకుండా అంత పెద్ద ప్లేస్ కూడా దొరకడం కష్టం కాబట్టే సాహో  బృందం రామోజీ ఫిలిం సిటీని ఎంచుకున్నారట.

ఇప్పటి వరకు సాహో పంక్షన్ లకు ప్రభాస్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణ గా వున్నారు. కానీ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దిగ్దర్శకుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ముఖ్య అతిధులుగా వస్తారని తెలుస్తోంది. ప్రభాస్ అంటే రాజమౌళి కి ప్రత్యేక అభిమానం. ఆ అభిమానంతోనే ఇటీవల సాహో సినిమాను ఆయనకు చూపించినట్లు, కొన్ని మార్పులు చెప్పినట్లు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

ఇదిలా వుంటే తమిళ, మలయాళ, హిందీ భాషల మీడియాను కూడా ఈ ఫంక్షన్ కు ప్రత్యేకంగా రప్పిస్తున్నారు. నేషనల్ మీడియా జర్నలిస్ట్ లు ప్రత్యేకంగా సాహో ఈవెంట్ కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం సాహో ని అన్ని ప్రధాన భాషల్లో నిర్మించడమే. పంక్షన్ ఏర్పాట్లు మొత్తం రామోజీ ఫిలిం సిటీలో, ఆ సిటీ సాంకేతిక బృందం సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. సాహో సిటీ అంటూ ఏర్పాటు చేస్తున్నది కొన్నాళ్ల పాటు అక్కడే వుంటుంది. సందర్శకులకు అదో ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. అతి పెద్ద ఎల్ ఇ డి స్క్రీన్ ఫంక్షన్ కోసం ఏర్పాటుచేస్తున్నారు. మొత్తానికి సాహో ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి సినిమాపై ఇంకా అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: