శర్వానంద్ ‘రణరంగం’ మూవీ పై పెట్టుకున్న ఆశలు గల్లంతు కావడంతో షాక్ లో ఉన్నాడు. అయినప్పటికీ ఈ మూవీ ప్రమోషన్ ను తన శక్తిమేరకు కొనసాగిస్తూ ఈ మూవీ కనెక్షన్స్ నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సినిమాలు అంటే కథా బలం ఉన్న సినిమాలు అనీ ప్రేక్షకులు భావిస్తారనీ అయితే ‘రణరంగం’ మూవీలో కథలో కొత్తదనం లేకపోవడంతో ఫెయిల్ అవుతుందని తాను ముందు నుంచి చెపుతూనే ఉన్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

అయితే తన కెరియర్ లో ఇప్పటి వరకు తాను ఎప్పుడు గ్యాంగ్ స్టర్ పాత్రను చేయకపోవడంతో ఆ పాత్ర నచ్చి తాను ఆ సినిమాను చేయడానికి ఒప్పుకున్నా విషయాన్ని వివరించాడు. ఈ సినిమాలో తాను చిరంజీవి మ్యానరిజమ్స్ చాల అనుసరించానని అయితే ఆ విషయాలను పట్టుకోకుండా ఈ మూవీకి కథ లేదు అంటూ విమర్శకులు దాడి చేసి ఈ మూవీని ఒక విధంగా చంపేశారు అంటూ తన ఆవేదన వ్యక్త పరిచారు.

ఒక ఇమేజ్ కి కట్టుబడి ఉండే పాత్రలు చేయడం తనకు ఇష్టం ఉండదు అంటూ అందువల్లనే తన కెరియర్ లో కొన్ని ప్రయోగాలు చేయవలసి వస్తోంది అన్న విషయాన్ని వివరించాడు. ఇక ఈ మధ్య తన భుజానికి జరిగిన గాయం గురించి మాట్లాడుతూ ఆ గాయం నుండి తాను కోలుకున్నా ఇంకా పూర్తిగా తాను చేయి తిప్పలేక పోతున్నానని ఈ విషయాలు సెట్ కావడానికి మరికొంత సమయం పడుతుంది అన్న క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం తాను నటిస్తున్న ‘96’ రీమేక్ సగం పూర్తి అయింది అని చెపుతూ తాను నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ శ్రీకారంలో కొత్త శర్వానంద్ ను చూస్తారు అన్న క్లారిటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులు బాగా మారిపోయిన నేపధ్యంలో సినిమా ఎంత బాగా తీసినా కథలో విషయం లేకుంటే ఆ సినిమా హిట్ కాదు అన్న విషయం తనకు ‘రణరంగం’ మూవీ బాగా అర్ధం అయ్యేలా చేసింది అని అంటున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: