కాంట్రవర్సియల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికర అంశానికి తెర లేపాడు. తన కొత్త కాన్సెప్ట్.. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకు క్యాస్టింగ్ కావాలంటూ ప్రకటన ఇచ్చాడనే వార్త ఫిలిం సిర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై హైప్ పెరిగిపోయింది. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద అంశాల్ని కథలుగా తెరకెక్కించిన ఆర్జీవీ ఏకంగా ఈసారి ఏపీలో ఎక్కువగా ఉండే కులాల కుంపట్లను టైటిల్ గా పెట్టుకుని సినిమా తీస్తున్నాడు. 

 

 

 

రీసెంట్ గా ఈ సినిమాలో ఉండే ఆయా పాత్రల కోసం నాయకుల డూప్ లు కావాలంటూ ప్రకటన జారీ చేసాడట వర్మ. సినిమా టైటిలే కులాల మీద కానీ సినిమా అంతా వ్యక్తులనే ప్రధాన పాత్రలుగా తీసుకుని సినిమా తీస్తున్నట్టు ఇప్పటికే వర్మ ప్రకటించాడు. దీంతో ఈ సినిమాలో ఉండే ఆయా పాత్రల కోసం అన్వేషణ మొదలెట్టాడు. దీని గురించి ఓ లిస్టే రిలీజ్ చేసాడట వర్మ. ఈ లిస్ట్ లో ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తమ్మినేని సీతారాం, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కేశినేని నాని, కోడెల, గంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి, ఏపీ పోలిస్ బాస్ గౌతమ్ సవాంగ్ ల పేర్లు ఉన్నాయట. వీరందరి డూప్ లు దొరికితే షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యమని ప్రకటించాడట అర్జీవీ.

 

 

 

వర్మ తీసిన రక్తచరిత్ర, వీరప్పన్, వంగవీటి.. వంటి సినిమాల్లో నిజమైన వ్యక్తులను పొలినవాళ్లనే తన సినిమాల్లో నటింపచేశాడు. దాంతో అవి సినిమాలుగా కాకుండా నిజ జీవితాలనే తెరపై చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. ఈ సినిమాకు కూడా ఇదే థియరీని ఫాలో అవుతున్నాడు. మరి.. ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: