'ఆర్ ఎక్స్ 100' సినిమా తో  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈచిత్రంతో ఓవర్ నైట్ లో గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే  బోల్డ్ పాత్రలో నటించి  యూత్ ను  ఫిదా చేసింది పాయల్.  ఈసినిమా బ్లాక్ బాస్టర్ క్రెడిట్ అంత  పాయల్ కే చెందుతుంది.  ఇక ఈ సినిమా తరువాత 'ఆర్ డి ఎక్స్ లవ్' అనే సినిమాలో  మరో సారి  బోల్డ్  కంటెంట్ వున్న పాత్రలో నటిస్తుంది పాయల్. నూతన దర్శకుడు శంకర్ భాను   దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  'హుషారు' ఫేమ్  తేజస్ కంచర్ల హీరోగా నటిస్తున్నాడు. ఇక సినిమా యూనిట్ అంత పాయల్ నే నమ్ముకుంది. అందుకే  సినిమాలోని ఆమె ఫొటో లను ఒక్కొక్కటిగా విడుదలచేసి  సినిమా కు  హైప్ తీసుకురావడనికి  ప్రయత్నిస్తున్నారు. 



 అందులో భాగంగా  ఇటీవల విడుదలైన  ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగ తాజాగా ఈచిత్రంనుండి మరో స్టిల్ ను విడుదలచేశారు. ఇక ఈ స్టిల్ లో హాట్ లుక్స్ తో  పిచ్చెక్కించేలా వుంది  పాయల్ రాజ్ పుత్.   సి కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై  ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందిస్తున్నాడు.  త్వరలోనే ఈ ఈచిత్రం యొక్క టీజర్ ను విడుదలచేయనున్నారు.  ఇక ప్రస్తుతం  ఈచిత్రంతో పాటు తెలుగులో  మరో రెండు  క్రేజీ సినిమాల్లో నటిస్తుంది  పాయల్.  అందులో ఒకటి 'వెంకీ మామ' కాగా రెండవది 'డిస్కో రాజా'.   మల్టీ స్టారర్  గా తెరకెక్కుతున్న వెంకీ మామా చిత్రంలో పాయల్  వెంకటేశ్ కూడా జోడిగా నటిస్తుండగా మాస్ రాజా  రవితేజ నటిస్తున్న డిస్కోరాజా లో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: