టాలీవుడ్ లో యాడ్స్ చేయడం అంటే మొన్నటి వరకి చిన్న చూపుగా భావించేవారు. హీరోగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ చీప్ గా యాడ్స్ లో నటించడం ఏంటనే భావన ఉండేది. అయితే బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్లు యాడ్స్ లో కనిపిస్తూ సినిమాల కంటే ఎక్కువ సంపాదించడం చూసాక మనవాళ్ళు కూడా యాడ్స్ లో కనిపించడం మొదలెట్టారు. అయితే ఇప్పటి వరకు పెద్ద హీరోలనే యాడ్స్ లో చూశాం. మహేష్ బాబు థమ్సప్ యాడ్ లో ,సంతూర్ యాడ్ లో కనిపిస్తాడు.


అయితే ఇప్పుడు నాని కూడా యాడ్ లో నటించాడు. స్ప్రైట్ యాడ్ లో కనిపించి ఇకనుండి యాడ్స్ కూడా చేస్తానని చెప్పాడు. స్ప్రైట్ యాడ్ లో కనిపించడం అంటే చిన్న విషయమేం కాదు. మొదటి సారే అంత పెద్ద బ్రాండ్ తో చేతులు కలపడం అంటే నానికి రెమ్యునరేషన్ భారీగా ముట్టిందనే వార్తలు వస్తున్నాయి. కూల్ డ్రింగ్ యాడ్ అంటే యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే హీరోను ఎంచుకుంటారు. హీరోలు కూడా ఇవి చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు.


గత కొంతకాలంగా నాని చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. చిన్న హీరో స్థాయి నుండి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అదీగాక బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించి తెలుగింటి ఫ్యామిలీలకు బాగా దగ్గరయ్యాడు. అందుకే స్ప్రైట్ యాడ్ కి నాని అయితే బాగుంటుందని భావించారట.


నానితో రూపొందించిన ఈ యాడ్ కుర్రకారుని బాగా ఆకట్టుకుంటుంది. త‌నదైన‌ వాయిస్ మాడ్యులేష‌న్‌తో, ఫీల్‌తో ఈజీగా అట్రాక్ట్ చేసే నాని.. ఈ ప్ర‌క‌ట‌న‌లో చెప్పిన వాయిస్ ఓవ‌ర్‌తోనే స‌గం స‌క్సెస్ అయిపోయాడు. ప్ర‌క‌ట‌న‌లో అత‌డి లుక్ మాత్రం మామూలుగానే ఉంది. మరి ఈ యాడ్ తర్వాత నాని మరిన్ని యాడ్ లో కనిపించే అవకాశం ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: