బిగ్ బాస్  తెలుగు మూడవ సీజన్ లో  ఇప్పటివరకు  మూడు ఎలిమినేషన్ లు జరిగాయి. అందులో భాగంగా  మొదటి వారం హేమ  ఎలిమినేట్ కాగా  రెండవ వారం జాఫర్ అలాగే మూడవ వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయ్యారు .  అయితే ఈ ఎలిమినేషన్ లను అందురు ముందుగానే  ఊహించారు. అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా అలాగే జరిగింది. దింతో ఈ ఎలిమినేషన్ పక్రియ  ప్రేక్షకులకు అంతగా కిక్ ఇవ్వలేదు. అయితే నాలుగవ వారం ఎలిమినేషన్ మాత్రం ఇందుకు భిన్నంగా జరుగనుంది.




ఈవారం  బాబా భాస్కర్ , శివ జ్యోతి , వరుణ్ సందేశ్ , రాహుల్ , రోహిణి ,  రవి ,శ్రీ ముఖి ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వగా  ఇందులో నిన్న శివ జ్యోతి , వరుణ్ సందేశ్  సేవ్  అయినట్లుగా  షో వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించాడు.  కాగా ఈ నామినేషన్ లిస్ట్ లో ఓటింగ్  ఆధారంగా చూస్తే   బాబా భాస్కర్ సేవ్  అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.  ఎందుకంటే అందరికన్నా అతనికే ఎక్కువ ఓట్లు పోలైయ్యాయి. ఆ తరువాత రవి , శ్రీముఖి కి ఎక్కువ ఓట్లు వచ్చాయట.  







ఇక  ఈ జాబితాలో చివరి రెండు స్థానాల్లో వున్నారు రోహిణి , రాహుల్.  వీరిద్దరికి దాదాపుగా సమానంగా ఓట్లు వచ్చాయని  సమాచారం. అయితే ఎలిమినేషన్  అయ్యే వారు ఎవరంటే ఎక్కువగా రోహిణి పేరు వినబడుతుంది.  ఆమె ఈ రోజు బిగ్ బాస్ హౌజ్  నుండి బయటికి రావడం ఖాయమని అంటున్నారు.   మరికొందరేమో రాహుల్  ఎలిమినేట్ అవ్వనున్నాడని  అంటున్నారు. మరి  రోహిణి ఎలిమినేట్ అవుతుందో లేక రాహుల్ ను ఎలిమినేట్ చేస్తారో  తెలియాలంటే  మరి కొద్దీ గంటల పాటు వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: