పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు విజయ్ దేవరకొండ. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన విజయ్ దేవరకొండకు పెళ్ళిచూపులు  తరువాత నటించిన ద్వారక ప్లాప్ అయినప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. గీతా గోవిందం, ట్యాక్సీవాలా సినిమాలు కూడా హిట్ అవ్వటంతో మిడిల్ రేంజ్ హీరోలలో స్టార్ స్టేటస్ అందుకున్నాడు విజయ్. మధ్యలో కొన్ని సినిమాలు ప్లాప్ అయినప్పటికీ ఆ సినిమాల ప్రభావం విజయ్ దేవరకొండ మీద ఏ మాత్రం పడలేదు. 
 
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా జులై నెలలో విడుదలైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి తెలుగులో యావరేజ్ టాక్ వచ్చింది. మొదటి మూడు రోజులు వసూళ్ళు బాగానే వచ్చినప్పటికీ సోమవారం నుండి ఈ సినిమాకు వసూళ్ళు దారుణంగా పడిపోయాయి. మిగతా భాషల్లో కూడా డియర్ కామ్రేడ్ సినిమా హిట్ కాలేదు. 
 
34 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా ఫుల్ రన్లో 25 కోట్ల రుపాయలు వసూలు చేసింది. తాజాగా డియర్ కామ్రేడ్ సినిమా గురించి విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసాడు. డియర్ కామ్రేడ్ సినిమాపై సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసారు.డియర్ కామ్రేడ్ సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేసి ఆ సినిమాను చంపేశారు. 
 
నాకు ఇలాంటివి కొత్తేం కాదు. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో నటించబోతున్నాడు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ పై నిర్మిస్తాడని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: