నేను ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్టే.. అనే డైలాగ్ ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోతుంది.  ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది అంటే టక్కున వచ్చే సమాధానం.. బాషా.  మాణిక్ భాషా. బాషాగా రజినీకాంత్ మెప్పించిన తీరు చెప్పలేనిది. ఎన్నో రికార్డులను ఈసినిమా తిరగరాసింది.  రజిని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఇదొకటి అని చెప్పొచ్చు.  ఆటో డ్రైవర్ గా, డాన్ గా ఆయన నటన అమోఘం.  సరిగ్గా 44 సంవత్సరాల క్రితం.. అంటే ఆగష్టు 18, 1975 వ సంవత్సరంలో రజినీకాంత్ తన మొదటి సినిమా అపూర్వ రారంగల్ చేశారు. 


ఆ మూవీ సూపర్ హిట్టైంది.  ఈ సినిమా హిట్ కావడంతో.. రజినీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  గత 44 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మెప్పించారు.  ఇప్పటికి మెప్పిస్తూనే ఉన్నారు.  రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ హంగామా అంతాఇంతా కాదు.  సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు.  జపాన్, కొరియా వంటి దేశాల్లో చెప్పాల్సిన అవసరం లేదు.  


రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 44 సంవత్సరాలైన సందర్భంగా ఓ అభిమానులు ఓ ప్రత్యేకమైన డిపిని రూపొందించారు.  ఒకే ఫ్రేమ్ లో రజినీకాంత్ నటించిన వివిధ సినిమాల్లోని బెస్ట్ పాత్రలకు సంబంధించిన ఫోటోలను ఉంచారు.  ఆ ఫోటోను చొస్తే.. రోబో సినిమా గుర్తుకు వస్తుంది.  ఒకే ఫ్రేమ్ లో రోబో రజినీకాంత్ లు ఎలా ఉంటాయో అలానే ఉన్నది డిపి.  ఇప్పుడు ఈ డిపి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


ప్రస్తుతం రజినీకాంత్ దర్బార్ సినిమా చేస్తున్నారు.  మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.  వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  దీని తరువాత రజినీకాంత్ శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.  బహుశా శివ దర్శకత్వంలో చేయబోయే సినిమానే రజిని చివరి చిత్రం కావొచ్చు.  ఈ మూవీ తరువాత రజినీకాంత్ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు.  రాజకీయాల్లో బిజీకావాలని కోరుకుంటున్నారు.  రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అయన అభిమానులు కూడా కోరుకుంటున్న సంగతి తెలిసిందే.  డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా రజినీకాంత్ పార్టీ పెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: