సౌత్ సినిమాల్లో నటించనని బెట్టు చేసిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ వెనక్కి తగ్గిందా? చాలా కాలంగా కష్టపడుతున్న హీరో పక్కన ఛాన్స్ రావడంతో మనసు మార్చుకుందా? జాన్వీ తెలుగు ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
శ్రీదేవి కూతురు తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయం చేయాలని దర్శకులు.. నిర్మాతలు ప్రయత్నించారు. అయితే ఆ ఛాన్స్ కరణ్ జోహార్ సొంతం చేసుకొని ధడక్ మూవీతో జాన్వీని ఇంట్రడ్యూస్ చేశాడు. తెలుగు సినిమా ఎపుడు తమిళంలోకి ఎంట్రీ కోసం అడిగితే ఇప్పట్లో లేదు.. బాలీవుడ్ లో పేరుతెచ్చుకున్నాకే అంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది. 

సౌత్ ఇండియాలో నటించడం జాన్వీకి ఇష్టం లేకపోయినా.. అర్జున్ రెడ్డి చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. హీరోతో నటించే ఛాన్స్ వస్తే చేస్తానని మాట వరుసకు చెప్పినా.. ఆ ఆఫర్ రానే వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీజగన్నాథ్ విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేశాడు. హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. 

జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఎంట్రీ ఇపుడు బాలీవుడ్, టాలీవుడ్ లో సైతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె తెలుగులో ఎపుడు సినిమాలు చేస్తుందా అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రముఖ నటి శ్రీదేవి కూతురు కావడంతో ఆమెపై సినీ ఫ్యాన్స్ ఎంతో ఆశపెట్టుకున్నారు. శ్రీదేవి పలు సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించింది. బాలనటిగా.. హీరోయిన్ గా.. దేవకన్యగా ఇలా ఎన్నో పాత్రలు వేసి అలరించింది. ఎందుకంటే శ్రీదేవి నటనా వైభవాన్ని చవిచూసిన ప్రేక్షకులు.. ఆమె కూతురిలో ఆ ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు. శ్రీదేవి వెండితెరపై ఎలా మెప్పించిందో అలానే జాన్వీ అలరిస్తుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. సౌత్ లో నటించనని ఖరాఖండీగా చెప్పేసిన జాన్వీకి అభిమాన హీరో పక్కన నటించే ఛాన్స్ మిస్ కాకుండా జాగ్రత్తపడుతుందో లేదో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: