రెండు పెద్ద సినిమాలు సైరా నరసింహా రెడ్డి.. సాహో నెల గ్యాప్ లో వస్తుంటే పోల్చి చూడటం కామన్. చిరంజీవి.. ప్రభాస్ అభిమానులు ఇదేపని చేస్తున్నారు. చిరంజీవికి టాప్ హీరో ఇమేజ్ ఉన్నా.. ప్రభాస్ తో పోటీ పడలేకపోతున్నాడన్నది హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి ఇమేజ్ ను ప్రభాస్ ఎలా ఓవర్ టేక్ చేశాడో ఓ సారి పరిశీలిద్దాం..


రాజకీయాల్లోకి వెళ్లేముందు వరకు చిరంజీవే నెంబర్ వన్. ఆయన తర్వాత ఆస్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేదు. ఖైదీ నెంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. 104కోట్లు కలెక్ట్ చేసి.. నాన్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటాడు. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోంది. 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్.. కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతి నటించారు. ఇంతమంది స్టార్స్ నటించడం.. తమిళం, కన్నడం.. హిందీలో బిజినెస్ కు ప్లస్ అవుతుందని ఊహించాడు నిర్మాత రామ్ చరణ్. అయితే ఈ మల్టీ స్టారర్ మూవీ ప్రభాస్ నటించిన సాహో బిజినెస్ ను అందుకోలేకపోయింది. 


చిరంజీవి టాలీవుడ్ టాప్ హీరోనే అయినా.. బాహుబలితో ప్రభాస్ కు ఇండియావైడ్ వచ్చిన క్రేజ్ మెగాస్టార్ ను మించిపోయింది. 350కోట్లతో తెరకెక్కిన సాహో సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ తో పాటు.. హిందీలో కలిపి 300కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఇక శాటిలైట్.. డిజిటర్ రైట్స్ తో నిర్మాత ఇప్పటికే సేఫ్ అయ్యాడు. బిజినెస్ విషయంలో సాహోతో పోల్చుకుంటే.. సైరా వెనుకబడి పోయిందంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సిిినిమాలో అమితాబ్.. సుదీప్.. విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఉన్నా కనిపించేది తక్కువ సమయమే కాబట్టి.. డిస్ట్రిబ్యూటర్స్ సీరియస్ గా తీసుకోవడం లేదట. తెలుగులో 100కోట్లకు పైగా బిజినెస్ జరుగుతున్నా.. 250కోట్ల బడ్జెట్ రాబట్టాలంటే.. తమిళం, హిందీ, కన్నడలో కూడా ఎక్కువ బిజినెస్ జరగాలి. 
సైరా కన్నడలో ఇప్పటికే మంచి రేటుకు అమ్ముడు కాగా.. బాహుబలి 2 రైట్స్ తీసుకున్న ఎఎ ఫిలింస్ మరో ఇద్దరితో కలిసి సైరాను హిందీలో రిలీజ్ చేస్తోంది. తమిళం.. మలయాళంలో ఇంకా బిజినెస్ కావాల్సి ఉంది. సిినిమా విడుదలకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది కాబట్టి అప్పటికి సైరా బిజినెస్ బడ్జెట్ ను దాటుతుందేమో చూడాలి. 





మరింత సమాచారం తెలుసుకోండి: