బిగ్‌బాస్ సీజ‌న్ 3 నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఈ వారంలో ఎలిమినేషన్స్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ రవి,  శివ జ్యోతి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి మ‌రియు శ్రీముఖి. అయితే నామినేట్ అయిన ఈ ఏడుగురు గ‌ట్ట‌వారే కావ‌డంలో బిగ్‌బాస్ నాలుగో వారం ఎలిమినేష‌న్స్ రంజుగా మారాయి. ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు అన్న దానిపై ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ నెల‌కొంది. తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రీముఖి చెప్పినట్లే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.


ఇక శ‌నివారం నైట్ కింగ్ నాగార్జున షూట్‌లో మోడల్స్‌తో స్టెప్పులేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాగార్జున కంటెస్టెంట్స్‌కు క్లాస్ పీకుడు కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ హౌస్‌లో గత నాలుగు వారాలుగా కంటెస్టెంట్స్‌లో ఎవరు హార్ట్ ఫుల్‌గా ఉంటున్నారు? ఎవరు ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడుతున్నారన్న దాన్ని గమనించిన  నాగార్జున వాళ్లకు ప్రవర్తనకి తగ్గట్టుగా అవార్డ్స్ ఇచ్చారు. మ‌రియు ఈ సంభాష‌ణ‌లోనే ఏడుగురు నామినేట్ స‌భ్యుల్లో శివజ్యోతి, వరుణ్ సందేశ్‌ల‌ను సేవ్ చేశారు.


ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం మిగిలిన ఐదుగురు బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్‌లో సేఫ్ అయ్యేవారు ఎవ‌రు అంటే ముఖ్యంగా శ్రీ‌ముఖి పేరు విన‌ప‌డుతోంది. ఎందుకుంటే తొలి వారం నుంచి ఎలిమినేషన్‌లో ఉన్నా ఈజీగా బ‌య‌ట‌పడుతోంది. పైగా విచిత్రం ఏంటంటే తొలి వారం నుంచి ఆమె చెప్పిన కంటెస్టెంట్ మాత్ర‌మే ఎలిమినేట్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే  మూడో వారంలో తమన్నా ఎలిమినేట్ అవుతుందని చెప్పిన శ్రీముఖి నాలుగోవారంలో రోహిణి ఎలిమినేట్ కావొచ్చంటూ చెప్ప‌డంతో సోష‌ల్ మీడియాలో రెండు రోజుల నుంచి విపరీతంగా చ‌ర్చ‌లు జరుగుతున్నాయి.


అదే విధంగా ఆమెకు ముందే బిగ్ బాస్ హింట్ ఇచ్చి అలా చెప్పమంతున్నారని ప్రముఖంగా ట్రోలింగ్ అవుతూ వస్తోంది. బిగ్ బాస్ వర్గాలు మాత్రం పూర్తి ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్స్ జరుగుతాయని చెబుతోంది. అయితే ఎప్పుడూ కూడా ఓటింగ్ వివ‌రాల‌ను బ‌య‌ట‌కు తెల‌ప‌లేదు. కార‌ణం ఏమైనా దీనిపై వివాదాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే గ‌త వారాల‌ను చూసుకుంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేందుకు రాహుల్ మ‌రియు రోహిణిల‌లో ఒక‌ర‌ని తెలుస్తోంది. రాహుల్, పునర్నవి వ్యవహారం చూస్తుంటే షో అవ‌స‌రాల మేర‌కు రాహుల్ సేఫ్ చేస్తార‌ని స‌మాచారం. మ‌రి శ్రీ‌ముఖి అంచ‌నా నిజ‌మ‌వుతుందో.. లేదో మ‌రి కొద్ది గంట‌ల్లో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: