అడ‌ల్డ్ కంటెంట్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన భామ పాయ‌ల్ రాజ్‌పుత్‌.  ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ఈ పంజాబీ బ్యూటీ అందాల విందుతో కుర్ర‌కారును క‌ట్టిప‌డేస్తుంది. ఫలితంగా తొలి ప్రయత్నమే బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అందాల ఆరబోతకు అడ్డు చెప్పని హాట్ బాంబర్ గా పాయల్ కుర్రాళ్ల గుండెల్లో ఉండిపోయింది. సరిగ్గా ఈ పాయింట్ నే క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం మరోసారి అలాంటి ప్రయత్నమే సాగుతోంది.


పాయల్ నటిస్తున్న తాజా చిత్రం `ఆర్.డి.ఎక్స్`. ఈ సినిమా నుంచి ఇప్పటికే పాయల్ స్టిల్స్ రిలీజై అంతకంతకు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హాట్ బాంబర్ లాంటి ఫోటోని చిత్రబృందం రివీల్ చేసింది. రెడ్ అలెర్ట్ ఆర్.డి.ఎక్స్ బ్లాస్ట్స్ అంటూ త్వరలో టీజర్ ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో పాయల్ అందచందాలు యువతరంలో చర్చకు వచ్చాయి. నాభి అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ళ గుండెల‌ను కొల్ల‌గొడుతోంది. చేతికి మూర మ‌ల్లెపూలు చుట్టి, మెడ‌లో మ‌ల్లెల దండ వేసుకుని ఆ దండ‌ను చేతిలో ప‌ట్టుకుని అలా న‌డుమందాల‌ను చూపుతూ తిప్పుకుంటూ న‌డుస్తూ వ‌స్తున్న స్టిల్ చూస్తే ఏ కుర్రాడికైనా కునుకుంటుందా 1000 కేజీల ఆర్డీఎక్స్ పేలినట్టుగా కుర్రకారు గుండెల్లో విధ్వంశం తప్పదేమో!  


ఈ చిత్రం లో బోల్డ్ పాత్రలో నటిస్తోంది పాయల్. తన గ్లామర్ తో యూత్ ఫిదా కావడం గ్యారెంటీ. ఈ సినిమా కథ పాయల్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. హుషారు తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజస్ కంచర్ల ఈ చిత్రంలో కథానాయకుడు. శంకర్ భాను దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసి కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాయల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీ. తెలుగు - తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటుంది. వెంకీ మామా చిత్రంలో వెంకటేశ్ కి జోడిగా నటిస్తోంది. మాస్ రాజా రవితేజ సరసన డిస్కోరాజా లో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది.


ఇక‌పోతే ఈ భామ ఇలా హాట్ క్యారెక్ట‌ర్స్‌ని ఒప్పుకుంటూ ప్రేక్ష‌కుల గుండెల్లో ఓ హాట్ బాంబ్ లాగా నిలిచిపోతుందా లేక వేరే పాత్ర‌ల్లో కూడా న‌టిస్తూ త‌న కెరియ‌ర్‌ని వేరే విధంగా డిజైన్ చేసుకుంటదా అన్న‌ది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: