మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన రోజుకో వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. స్వాతంత్ర పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. ఈ క్రమంలో  తాజాగా ఇటీవల ఆగస్టు 14వ తారీఖున సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదలైన క్రమంలో ఆ సన్నివేశాలు చూసి సినిమాపై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి చేసిన పోరాటాలు సినిమాకే హైలెట్ అని మేకింగ్ వీడియోలో ఉన్న దృశ్యాలు బట్టి అర్థం అవుతున్నాయి.


ఇటువంటి నేపథ్యంలో తాజాగా మేకింగ్ వీడియో తో మెగా అభిమానులను అలరించిన సైరా టీమ్...త్వరలో చిరంజీవి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో సైరా టీమ్ నుండి మరో సర్ప్రైజ్ వస్తున్నట్లు ఫిలింనగర్లో టాక్. ఇదిలా ఉండగా పవన్ ఈ సినిమాకు సంబంధించిన తాజా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారన్న వార్త అభిమానుల్లో సమయం ఎంత త్వరగా గడుస్తుందా పవన్ గొంతు మళ్ళీ ఒక సినిమాలో వినబోతున్నామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు వీరి ఆనందాన్ని మరింత ఎక్కువ చేసే విధంగా మరో వార్త కూడా బలంగా వినిపిస్తుంది.


పవన్ గొంతు కేవలం ఒక్క టీజర్ లో మాత్రమే కాదని సినిమాలో కూడా వినబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం కనుక ఉంటే సినిమా హాల్లో మెగా అభిమానులకు పూనకాలే అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా నిర్మాత రామ్ చరణ్ చిరంజీవి కెరీర్ లోనే ఏ సినిమాకు చేయని విధంగా చేయటానికి అద్భుతమైన ప్లాన్ వేసినట్లు సినిమా యూనిట్ నుండి వస్తున్న సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: