ప్ర‌స్తుతం వ‌య‌సు పైబ‌డిన సీనియ‌ర్‌ హీరోల స‌ర‌స‌న కుర్ర హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఇది ఇప్పుడు కామ‌న్ అయిపోయింది. కానీ త‌మ క‌న్నా వ‌య‌సు ఎక్కువ ఉన్న హీరోయిన్ల‌తో హీరోలు రొమాన్స్ చేసిన స‌న్నివేశాలు చాలా అరుదుగా ఉంటాయి. మ‌రి ఆ చిత్రాలు ఏంటో ఓ సారి లుక్కేయండి..


ఐశ్వర్యారాయ్(45), పృథ్విరాజ్ సుకుమారన్(36): మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రావన్ చిత్రంలో వీరిద్ద‌రు న‌టించారు. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ పృథ్విరాజ్ క‌న్నా ఏకంగా 9 ఏళ్లు ఎక్కువ‌. 2010 లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాలు అందుకోలేదు.


మహేష్ బాబు(44), నమ్రత (47): బి. గోపాల్ దర్శకత్వం వహించిన టాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ వంశీ చిత్రంలో రియ‌ల్ లైఫ్ క‌పుల్స్ మ‌హేష్ మ‌రియు న‌మ్ర‌త శిరోద్కర్ జంట‌గా న‌టించారు. వ‌య‌సులో మ‌హేష్ న‌మ్ర‌త క‌న్నా మూడు సంవ‌త్స‌రాలు చిన్న‌వాడైనా.. ఈ సినిమాతోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింది.


శర్వానంద్ (34), శ్రియ శరన్ (36): పి. నారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కామెడీ ఎంటర్టైనర్ `నువ్వా నేనా` చిత్రంలో అల్ల‌రి న‌రేష్ మ‌రియు శ‌ర్వానంద్ హీరోలుగా న‌టించారు. శ్రియ తన క‌న్నా వ‌య‌సులో చిన్న హీరో శ‌ర్వానంద్‌తో రొమాన్స్ చేసింది.


రానా(34), అనుష్క(37) : గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రుద్రమదేవి` చిత్రంలో రానా మ‌రియు అనుష్క న‌టించారు. ఈ చిత్రంలో త‌న క‌న్నా వ‌య‌సులో చిన్న వాడైన ద‌గ్గుబాటి రానాతో అనుష్క ఆడిపాడింది.


శింబు (36), జ్యోతిక (40): మన్మధ చిత్రంలో స్టార్ హీరో శింబు మ‌రియు జోతిక క‌లిసి న‌టించారు. జ్యోతిక త‌న‌క‌న్నా వ‌య‌సులో నాలుగేళ్లు చిన్న‌వాడైన శింబుతో రొమాన్స్ చేసింది.


అధర్వ (30),సమంత(32): `బాణ కథాది` చిత్రంలో త‌మ‌ళి హీరో అధ‌ర్వ మ‌రియు స‌మంత జంట‌గా న‌టించారు. ఈ సినిమాలో త‌న‌క‌న్నా వ‌య‌సులో రేండేళ్లు పెద్ద‌దైన స‌మంత‌తో ఆధ‌ర్వ న‌టించాడు.


ఎన్టీఆర్(36), అమీషా పటేల్ (43): బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన న‌ర‌సింహుడు చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న అమీషా ప‌టేల్ న‌టించింది. 2005లో వ‌చ్చిన ఈ సినిమాలో వ‌య‌సులో త‌న‌క‌న్నా దాదాపు ఏడేళ్లు పెద్ద‌దైన అమీషాతో రొమాన్స్ చేశాడు.


అబ్బాస్(44), టబు (47): కదిర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌న ప్రేమ‌దేశం చిత్రంలో అబ్బాప్, వినీత్, టబు క‌లిసి న‌టించారు. 1996 వ‌చ్చిన ఈ సినిమాలో త‌న‌క‌న్నా చిన్న‌వాడైన అబ్బాస్‌తో ట‌బు రొమాన్స్ చేసింది.


ధనుష్ ( 36), శ్రీయ(36): 2010 లో భారతీయ తమిళ-భాష రొమాంటిక్ యాక్షన్-డ్రామా చిత్రంగా విడుద‌ల అయిన కుట్టి చిత్రంలో ధ‌నుస్ మ‌రియు శ్రీయ క‌లిసి న‌టించారు. కొన్ని నెల‌లో పెద్ద‌దైన‌ శ్రీయతో ధ‌నుష్ రొమాన్స్ చేశాడు.


భూమిక(40), ఎన్టీఆర్(36): ఎన్టీఆర్ త‌న క‌న్నా నాలుగేళ్లు పెద్ద‌దైన భూమిక‌తో క‌లిసి న‌టించాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన సాంబ మ‌రియు సింహాద్రి చిత్రాలు సూప‌ర్ హిట్ అయ్యాయి.


నితిన్ (36), రైమా సేన్(39): తేజ ద‌ర్శ‌క‌త్వంలో 2005లో వ‌చ్చిన ధైర్యం సినిమాలో నితిన్ మ‌రియు రైమా సేన్ క‌లిసి న‌టించారు. ప్రేమ కథాచిత్రంగా విడ‌ద‌లైన ఈ సినిమాలో త‌న‌క‌న్నా మూడేళ్లు పెద్ద‌దైన రైమా సేన్‌తో నితిన్ రొమాన్స్ చేశారు.


నయనతార(34), రానా(34): జాగర్లమూడి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం కృష్ణం వందే జగద్గురం. ఈ చిత్రంలో కొన్ని రోజులు మాత్ర‌మే పెద్ద‌దైన న‌య‌న‌తార‌తో రానా న‌టించారు. 2012లో ఈ చిత్రం విడుద‌ల అయింది.


ధనుష్ (36), స్నేహ(37): సెల్వరాఘవన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుదుపేట్టై  చిత్రంలో ధ‌నుష్ మ‌రియు స్నేహ క‌లిసి న‌టించారు. ఈ చిత్రంలో త‌న‌క‌న్నా పెద్ద‌దైన స్నేహ‌తో ధ‌నుష్ రొమాన్స్ చేశారు. 2006లో వ‌చ్చిన ఈ చిత్రంలో సోనియా అగర్వాల్ కూడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: