గత కొన్ని సంవత్సరాలుగా  సోషల్ మీడియాలో యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై అనేక రూమర్స్ ను వండి వడ్డిస్తూనే ఉన్నారు రాతల రాయుళ్లు.  అందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నారని..  పెళ్లి 'సాహో' విడుదల తరువాత ఉండబోతుందని ఇటీవలే వార్తలు పుట్టించారు.  చివరికి ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని తేలింది. కాగా ప్రభాస్  తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో  మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని  మీడియా ప్రశ్నించగా..  ‘పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు’ అని ప్రభాస్  తెలిపారు. ప్ర‌భాస్ పెళ్లి గురించి ఆ మధ్య  రెబల్ స్టార్  కృష్ణంరాజు స్పందిస్తూ.. 'ప్ర‌భాస్ చిన్న‌పిల్లాడు కాదు కదా   పదేపదే  పెళ్లి చేసుకోమని చెప్ప‌డానికి.  మా మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా  త్వ‌ర‌లోనే చేసుకుంటానని  ప్రభాస్ చెబుతూ ఉన్నాడని  కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. దీని బట్టి పెళ్లి విషయంలో ప్రభాస్ దే  తుది నిర్ణయం అని తేలిపోయింది. అంటే ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

    
ఇక ఇటివలే ప్రభాస్ పెళ్లి పై  కృష్ణంరాజు సతీమణి  శ్యామ‌లా దేవి  మాట్లాడుతూ.. 'ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని మాకు కూడా తొంద‌రగానే ఉంది. మేం తనని పెళ్లి గురించి అడిగితే..  ప్రస్తుతం చేస్తోన్న సాహో విడుదల  అయిపోయాక చూద్దాం అన్నాడు.  ఏమైనా  త్వ‌ర‌లోనే తప్పకుండాప్రభాస్  పెళ్లి క‌బురు చెబుతామ‌ని ఆమె చెప్పుకొచ్చారు.   కానీ మీడియా మాత్రం ప్రభాస్ పెళ్లి పై  అత్యుత్సాహమే చూపిస్తోంది. దీనికి తోడు ఆ మధ్య  ప్రభాస్ అనుష్కను  పెళ్లిచేసుకోబోతున్నారనే వార్త  కూడా  బాగా వైరల్ అయింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.  ఏమైనా ప్రభాస్ పెళ్లి విషయంలో  అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఏది నమ్మలేం. ఏది ఏమైనా   నేటి సమాజంలో  అవివాహితులుగా ఉండేవారి సంఖ్య  రోజురోజుకి  ఎక్కువైపోతుంది.  పెళ్లి చేసుకుని బాధ్యతల్లో కూరుకుపోవడం కన్నా, స్వేచ్ఛగా జీవించడానికే ఎక్కువ మంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.  అన్నట్లు  'మనిషి' అడవిలో ఉన్నప్పుడు కనిపెట్టిందే 'పెళ్లి'.. అలాంటి పెళ్లి  మీద  నాకు గౌరవం లేదని.. ఓ సినిమాలో  హీరో ఆవేశంగా డైలాగ్ చెప్పేస్తాడు. అందుకు తగ్గట్లుగానే  ఈ విషయంలో ప్రముఖులు సైతం ఆసక్తి కనబరుస్తుండటం విశేషం.   

మరింత సమాచారం తెలుసుకోండి: