యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న సినిమా `సాహో`. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో రూపొందుతున్న హై బడ్జెట్ సినిమా `సాహో ` ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు మంచి హైప్ తీసుకువ‌చ్చాయి. ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ ప‌నుల్లో బిజీగా ఉండి. భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఆగ‌ష్టు 30న విడుద‌ల కాబోతుంది. 


ఇక తాజాగా విడుద‌లైన సైకో స‌య్యో అనే సాంగ్ కి బాలీవుడ్‌, టాలీవుడ్‌, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. మ‌రియు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భాస్‌కు అభిమానులు ఉండ‌డంతో ఈ చిత్రానికి మ‌రింత ప్ల‌స్ అయింది. దాదాపు రూ. 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రాబోతున్న‌ ‘సాహో’ మానియాతో ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ ఊగిపోతున్నారు. ఇదిలా ఉంటే సాహో బెనిఫిట్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. 


ఆగ‌ష్టు 29 రాత్రి  సాహో స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్లలో రానున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా సాహో బెనిఫిట్ షోలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితె టిక్కెట్ ధ‌ర రూ. 500/- నుంచి స్టార్ట్‌ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చిత్ర యూనిట్ అనుమ‌తులు కోసం ప్ర‌భుత్వానికి అభ్య‌ర్థ‌న చేసింది. అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ప్ర‌క‌టన చేస్తుంద‌ని తెలిసింది. 


ఈ గ‌నుక నిజ‌మైతే ప్ర‌భాస్ అభిమానులు ఒక రోజు ముందుగానే సాహోను చూడ‌వ‌చ్చు. నిజానికి ప్ర‌భాస్‌కు ఉన్న క్రేజ్ మ‌రియు సాహోపై ఉన్న బ‌జ్‌తో టికెట్ రూ. 500 కాదు ఎంతైనా కొనే విధంగా అభిమానులు ఉన్నారు. బెనిఫిట్ షో మొద‌లైన త‌ర్వాత రోజు ఉద‌యం నుంచి మిగిలిన‌ థియేట‌ర్ల‌లో సాహో సంద‌డి స్టాట్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: