రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్. అందులో సందేహమే లేదు. తన లేటెస్ట్ మూవీ మన్మథుడు2 లో చాలా గ్లామర్ గా ప్రేక్షకులను మెప్పించింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా రకుల్ మార్క్ అందాలకు అభిమానులు ఖుషీ అవుతున్నారు. తెలుగులో అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ పొందిన హీరోయిన్లతో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది.

 


ప్రస్తుతం అమ్మడు వెకేషన్ లో ఉంది. సినిమా షూటింగుల బిజీ అయిపోయిందేమో విదేశాలకు వెళ్లిపోయింది. వెళ్లడమే తరువాయి.. అక్కడి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తన గ్లామర్, అందాలను ఆరబోస్తోంది. బ్లూ బికినీలో రకుల్ ప్రీత్ సింగ్ వయ్యారాలు యూత్ ని చూపు తిప్పుకోనివ్వనంతగా ఉన్నాయి. ఇటివల హిందీ సినిమా కోసం బక్కచిక్కిన ఈ భామ బికినీలో మరింత సన్నగా ఉంది.“పైన ఆకాశం, కింద ఇసుక.. మనశ్శాంతి తోడుగానే ఉంది..” అంటూ కోటేషన్ కూడా యాడ్ చేసింది. ఆ బీచ్ ఎక్కడో.. ఏ దేశమో చెప్పలేదు కానీ ఈ ఢిల్లీ బ్యూటీ మాత్రం ప్రస్తుతం తెగ ఎంజాయ్ చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. రకుల్ అందాలకు ఫిదా అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు.

 


‘రకుల్.. ఏంటి ఇలా అయిపోయావు..’, ‘యూ ఆర్ టూ హాట్’, ‘మరీ ఇంత బక్కచిక్కిపోతే నాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు’ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 2014లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు తర్వాత మరే సినిమాకు సైన్ చేసిందో తెలియాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: