ఎన్నికల తర్వాత బాలయ్య సినిమా ఎవరితో ఉంటుంది అనేది చాలా రోజులు ప్రశ్నార్థకంగానే ఉండేది. అటు బోయపాటి బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు కె యస్ రవికుమార్ కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే వీరిద్దరిలో ఎవరితో చేస్తాడని చాలా కాలం ఎదురు చూసారు. అయితే బోయపాటి సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనడంతో నిర్మాతలు ఆ సినిమా తీయడానికి ముందుకు రాలేదని సమాచారం.


దాంతో ఆ సినిమా కంటే ముందు మరో సినిమా చేయాలన్న ఉద్దేశ్యంతో బాలయ్య కె యస్ రవికుమార్ కి ఓకే చెప్పడంతో ఆ సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. కాగా తాజాగా ఈ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ లో సోనాల్ చౌహాన్ కూడా పాల్గొందట. బాలయ్య – సోనాల్ పై ఓ సాంగ్ షూట్ చేయనున్నారు. ఇక ఈ సాంగ్ కోసం సోనాల్ బికినీ వేస్తోందని తెలుస్తోంది.


ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుందని సమాచారం. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది.


అయితే ఈ సినిమాలో నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సంవత్సరం ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: